మహిళలూ ఈ లక్షణాలను విస్మరించకూడదు.. బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు!
బ్రెస్ట్ క్యాన్సర్ ( రొమ్ము క్యాన్సర్) నేటికాలంలో మహిళలకు ప్రాణాంతకంగా మారిన ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒక్కటి. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా ఈ మహమ్మారి వల్ల దాదాపు పదిమిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో 2.26మిలియన్ల మంది బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారని WHO వెల్లడించింది. మనదేశంలో ఏటా దీని బారినపడి మరణిస్తున్నవారి సంఖ్య లక్షల్లో ఉందంటే ఈ మహమ్మారి ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు. 40ఏళ్లుదాటిన మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కానీ నేటికాలంలో మూడుపదుల వయస్సు దాటనివారిపై కూడా ఈ మహమ్మారి పంజావిరుస్తోంది. సరైన అవగాహన ఉన్నట్లయితే... ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు.
స్త్రీలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవల్సిన సమయంలో ఎన్నో బాధ్యతలు వారిని నిర్లక్ష్యం చేస్తాయి. కుటుంబ బాద్యత ఆమెదే. కానీ ఆమె ఆరోగ్యం విషయంలో మాత్రం వెనక్కు తగ్గుతుంది. ఈ నిర్లక్ష్యమే వారిలో ఎన్నో జబ్బులకు కారణం అవుతుంది. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న జబ్బుల్లో బ్రెస్ట్ క్యాన్సర్. నేటికాలంలోనూ చాలామంది మహిళల్లో ఈ మహమ్మారి గురించి అవగాన లేదు. చాలామందిలో మూడోదశకు వచ్చినప్పుడు మాత్రమే గుర్తిస్తున్నారు. గ్రామీణ, అరబ్ ప్రాంతాల నుండి మెట్రో పాలిటిక్స్ సిటీ వరకు, మహిళలు ఇప్పటికీ బ్రెస్ట్ స్క్రీనింగ్ లేదా ఇతర రకాల రొమ్ము పరీక్ష ప్రక్రియలకు భయపడుతున్నారు. మహిళలు తమ ఆరోగ్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు.
రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి?
స్త్రీలలో వచ్చే వ్యాధులలో ఒకటి రొమ్ము క్యాన్సర్. ఇది రొమ్ములో అభివృద్ధి చెందుతుంది. ఈ క్యాన్సర్ పురుషుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మహిళలకు మాత్రమే అవకాశం ఎక్కువ. రొమ్ము క్యాన్సర్ అనేది చిన్న గడ్డలతో ఏర్పడుతుంది. రొమ్ము లోపల లేదా బయట ఏర్పడతాయి. ఇది ప్రారంభ దశలో చిన్నపాటి నొప్పితో ఉంటుంది. ఆ సమయంలోనే గుర్తించినట్లయితే...ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.
రొమ్ము క్యాన్సర్ లక్షణాలు:
-రొమ్ములోని ఏ భాగంలోనైనా భరించలేని నొప్పి
-రొమ్ము ఆకృతిలో మార్పు
-చనుమొన నుండి పాలు కాకుండా ద్రవం కారడం.
-రొమ్ము వాపు, నొప్పి, బిగుతుగా అనిపించడం
-చనుమొన ఎరుపు
రొమ్ము క్యాన్సర్ ప్రమాద కారకాలు:
-పీరియడ్స్ ముందుగానే రావడం.
-శారీరకంగా చురుకుగా లేకపోవడం.
-కుటుంబ చరిత్ర
-గర్భనిరోధక మాత్రలు
-వ్యాయామం చేయకపోవడం.
-అనారోగ్యకరమైన ఆహారం
రొమ్ము క్యాన్సర్ చికిత్స:
రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి మామోగ్రామ్, అల్ట్రాసౌండ్, బయాప్సీని ఉపయోగిస్తారు. సరైన సమయంలో రొమ్ము క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స, నివారణ రెండూ సాధ్యమే. డైటరీ థెరపీ, బ్రెస్ట్ సర్జరీ, మందులు, హార్మోన్ల ఇంజెక్షన్లు మొదలైన వాటిని నివారించాలి. అయితే, దాని చికిత్స అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో క్యాన్సర్ దశ, రోగి వయస్సు, స్థానం, మానసిక ఆరోగ్యం, రోగి యొక్క వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది.