బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి రావచ్చు...  అందులో రిస్క్ ఎంత ?

 


బ్రెస్ట్ క్యాన్సర్ వయస్సు పై బడుతున్న కొద్ది మంది స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. 3౦ ఏళ్ల లోపు స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అరుదు.మొత్తం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులలో 3౦ ఏళ్ల లోపు  వాళ్లకు వచ్చే అవకాశం 1.5 శాతం మాత్రమే ఉంటుంది.

4౦ ఏళ్ల స్త్రీలకు -21 7 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది.

5౦ ఏళ్ళు -5౦ మందిలో ఒకరికి.

85 ఏళ్ళు దాకా జీవించే స్త్రీలకు 8 మందిలో ఒకరికి వచ్చే అవకాశం రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా అంతార్జాతీయంగా వచ్చిన పరిశోధనలలో ఈ క్రింది స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంది. సామాజికంగా,ఆర్ధికంగా హై స్టేటస్ లో ఉండే స్త్రీలు వృత్తి వ్యాపారాలు చేసే స్త్రీలు,అవివాహిత స్త్రీలు. పిల్లలు కలగని స్త్రీలు,వక్షోజం లో అసాధారణ లక్షణాలు కల స్త్రీలు. నన్స్, ఆలస్యంగా పిల్లలు కలిగిన స్త్రీలు, ప్రసవ సమయంలో పాలు ఉత్పత్తి కాని స్త్రీలు. పిన్న వయస్సులోనే 12 ఏళ్ల వయస్సులోపు రసజ్వల అయిన వాళ్ళు 55 ఏళ్ల తరువాత ముట్లుదిగిన స్త్రీలు. గర్భాశయం, జీర్ణాశయం, రెక్టం, అందాసాయాల క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న స్త్రీలు. కొవ్వు పదార్ధాలు అధికంగా తినే స్తూల కాయం గల స్త్రీలు. దీర్ఘకాలం పాటు హార్మోన్లతోకూడుకున్న గర్భ నిరోధక మాత్రలు వాడిన స్త్రీలు. అమ్మ,అమ్మమ్మ అక్క చెల్లెళ్ళు కూతుళ్ళలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటె వాళ్ళ లో ఎంత మందికి  ఏ ఏ వయస్సులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అన్న అంశం పై బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 
ఆధార పది ఉంటుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ లో దశలు ---

ప్రాధమిక దశ...

వక్షోజం లోని గడ్డ 2 సెంటి మీటర్లు లోపున ఉంటె అంటే 3 /4 వంతు అది ప్రాధమిక దశ.కిందికి వస్తుంది.దీనిని స్టేజ్ ౦ గా నిర్ధారిస్తారు.క్యాన్సర్ గడ్డ చిన్నగా ఉంటె అవతలకు వ్యాపించే స్థాయిలో లేకపోతే ౦ దశగానే నిర్ధారిస్తారు.

మొదటి దశ...

గడ్డ రెండు సెంటిమీటర్ల కు మించి ఉండక పోవడం క్యాన్సర్ ఇంకా లింఫ్ నోడ్స్ వరకూ  వ్యాపించిఉండక పోవడం క్యాన్సర్ వక్షోజాన్ని దాటి అవతలికి వెళ్లక పోవడం.

రెండవ దస...

గడ్డ 2 నుండి 5 సెంటీ మీటర్లు మధ్య ఉండడం క్యాన్సర్ చంకలోని లింఫ్ నోడ్స్ కి వ్యాపించి ఉండవచ్చు. వ్యాపించక పోవచ్చు.లేదా గడ్డ 2 సెంటీ మీటర్ల లోపు ఉండి కూడా చంకలో 3 మీటర్లకు మించని లింఫ్ నోడ్స్ కి వ్యాపించడం లేదా వక్షోజం లో అసలు గద్దె ఉండక పోవచ్చని క్యాన్సర్ కణాలు చంకలో 3 కు మించని లింఫ్ నోడ్స్ లో కనిపించడం.

మూడవ దశ...

స్థానికంగా ముదిరి పోయిన క్యాన్సరు.కిందకు వస్తుంది.దీనిని క్యాన్సరు కణాలు వక్షోజాలకు దగ్గరగా ఉండే లింఫ్ నోడ్స్ కి ఉదాహరణకు చంకలోను కాలర్ బోన్ వద్ద ఉండే లింఫ్ నోడ్స్ కి వ్యాపించి ఉంటాయి గాని ఇంకా అవతలి అవయవాలకు పాకవు.గడ్డ 5 సెంటీ మీటర్లు మించి ఉండదు కాని చంకలోని లింఫ్ నోడ్స్ లో వరసగా కాకుండా అక్కడక్కడా కనిపించడం. 5సెంటీమీటర్ల నున్చిలోపు ఉంటుంది కాని దగ్గరలోని లింఫ్ నోడ్స్ లో ప్రవేశించడమే కాక గడ్డ పక్క కణాలకు కూడా పాకి దాని మూలంగా అక్కడి లింఫ్ నోడ్స్ ఒకదాని తో ఒకటి కలిసిపోవడం.క్యాన్సర్ కణాలు కాలర్ బోన్  పైభాగాన ఉండే లింఫ్ నోడ్స్ కి కూడా వ్యాపించడం

ఇంఫ్లామేటరీ బ్రెస్ట్ క్యాన్సర్...

ఇది మూడవ దశ కిందకి వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ఈ రకమైన బ్రెస్ట్ క్యాన్సర్ లో గడ్డ ఉండక పోవచ్చని క్యాన్సర్ కణాలు లింఫ్ వ్యవస్థకు చెందిన నాళాలను మూసేస్తాయి దీనివల్ల వక్షోజం ఉబికి సాగిపోతాయి పై చర్మం ఎర్రగా గరుకుగా అయి గట్టి పడిపోతుంది.దీనిని కూడా డాక్టర్లు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ కిందే పరిగ నిస్తారు.

నాల్గవ దశ...

ఇది పూర్తిగా ముదిరి పోయిన దశ,క్యాన్సరు కణాలు వాక్షోజానికి దూరంగా ఉండే ఎముకలు,ఊపిరి తిత్తులు లివర్,లాంటి శరీర భాగాలకు ఆడారి దాపుల్లో ఉండే లింఫ్ నోడ్స్ కి వ్యాపించి ఉంటాయి. నాల్గవదశ బ్రెస్ట్ క్యాన్సర్ ను మేటా స్టా టిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. నాలుగు దశలలో సోకే బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స సరైన సమయం లో తీసుకుంటేనే క్యాన్సర్ నుండి విముక్తి  అన్నిటి కన్నా మానసికంగా కుంగి పోక దృడంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి.విజయం సాధించాలి.