సూర్య నస్కారాలు వాటి ఉపయోగాలు!

ఇప్పుడున్న ఊరుకులపరుగుల జీవితం లో ఆరోగ్యం మీద శ్రద్ద లేకుండా పోతుంది. దీనివల్ల బరువు పెరగడం, ఒత్తిడికి గురవడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి రోజు ఒక అరగంట వ్యాయామానికి సమయం కేటాయించడం వలన అందం, ఆరోగ్యం రెండింటిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఆ వ్యాయామాలు ఏంటో? వాటివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం .

సూర్య నమస్కారం ఎనిమిది ఆసనాలతో 12 దశల్లో సాగుతుంది.

* జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది..

ప్రతి రోజూ సూర్య నమస్కారం చేయడంవల్ల .. జీర్ణవ్యవస్థ పనితీరుకు మేలు చేస్తుంది. ఇది పేగులోలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ముందుగు వంచడం, సాగదీయం వల్ల.. పొత్తికడుపుపై ఒత్తిడి పడుతుంది. ఇది కడుపులో చిక్కుకున్న గ్యాస్‌ తేలికగా బయటకు వెళ్లేలా సహాయపడుతుంది. రోజూ సూర్య నమస్కారం చేస్తే అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.

* బరువు తగ్గుతారు..

ఒక సెట్‌ సూర్య నమస్కారం చేస్తే.. శరీరం నుంచి అదనపు కేలరీలు, కొవ్వును బర్న్‌ చేస్తుంది. సూర్యనమస్కారాలు వేగంగా చేయడం వల్ల.. వేగంగా బరువు తగ్గవచ్చు. ఇవి జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

* పీసీఓఎస్‌ తగ్గిస్తుంది..

సూర్యనమస్కారాలు 12 వారాల పాటు 10 - 15 నిమిషాలు చేస్తే.. సాధారణ వ్యాయామాల కంటే.. చాలా ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పిన పీరియడ్స్‌ను.. సమయానికి వచ్చేలా చేస్తాయి. సూర్య నమస్కారం ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పీసీఓఎస్‌కు ఒత్తిడి హార్మన్‌ పెరగడం కూడా ఓ కారణం. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు.. క్రమతప్పకుండా సూర్యనమస్కారాలు ప్రాక్టిస్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. సూర్య నమస్కారం శరీరాన్ని డీటాక్స్‌ చేస్తుంది, అదనపు కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు విడుదల చేస్తుంది.
స్ట్రెస్‌ తగ్గిస్తుంది.. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడతాయి. సూర్యనమస్కారాలలోని లోతైన శ్వాస ప్రక్రియలు.. నాడీ కణాలను రిలాక్స్‌ చేస్థాయి. ఇవి భావోద్వేగ స్థిరత్వాన్ని పెంచుతాయి. రోజూ సూర్య సమస్కారాలు చేయడం వల్ల.. సృజనాత్మకత కూడా పెరుగుతుంది.

* మెరిసే చర్మం మీ సొంతం..

సూర్య నమస్కారాలు.. సౌందర్య సంరక్షణలోనూ సహాయపడతాయి. ఈ ఆసనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖానికి ప్రకాశవంతమైన కాంతిని అందిస్తాయి. ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. సూర్యనమస్కారాలు నిద్రను ప్రేరేపిస్తాయి, విశాంతిని అందిస్తాయి, జీర్ణక్రయను మెరుగుపరుస్తుంది. సూర్యనమస్కారాలు.. వేగంగా చేస్తే చెమట ఎక్కువగా పడుతుంది. చమట ద్వారా చర్మంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలు బయటకు వస్తాయి. మీ చర్మం తాజాగా మారుతుంది

* వీళ్లు వేయకూడదు..

గర్భిణులు మూడోనెల తర్వాత సూర్య నమస్కారాలను వేయకూడదు. హైపర్‌టెన్షన్‌, గుండెజబ్బు, హెర్నియా, పేగుల్లో క్షయ వంటి సమస్యలు ఉన్నావారు, గతంలో స్ట్రోక్‌కు గురైనవారు సూర్యనమస్కారాలు వేయకూడదు. వెన్నునొప్పి, మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనాలు వేసే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మేలు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, నొప్పి ఉన్నవారు సూర్యనమస్కారాలు చేయవద్దు.