వేసవిలో ఆరెంజ్ పీల్ ఇలా ఉపయోస్తే మెరిసిపోతారు!

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటివి కలిగి ఉన్న నారింజ తొక్కలు చర్మానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయని మీకు తెలుసా ? ఆరెంజ్ పీల్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. నల్ల మచ్చలు తగ్గించడానికి నారింజ తొక్కను నేరుగా చర్మంపై రుద్దడం లేదా క్యారియర్ ఆయిల్‌తో కలిపిన నారింజ తొక్క పొడిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

ఆరెంజ్ పీల్ చర్మపు రంధ్రాలను బిగించి, అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది, రిఫ్రెష్ అనుభూతిని అందిస్తుంది. ఆరెంజ్ పీల్ లోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మోటిమలు కలిగించే బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో సహాయపడతాయి, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్, అకాల వృద్ధాప్యం నుండి రక్షించడంలో సహాయపడతాయి.

జిడ్డుగల చర్మం కోసం:

2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి

1 Tbp నారింజ తొక్క పొడి

అవసరం మేరకు రోజ్ వాటర్

ఒక చిన్న గిన్నెలో అన్ని పదార్థాలను కలపాలి. వారానికి ఒకసారి ఈ పేస్ట్‌ను ప్యాక్ లాగా వేసుకోవాలి..

పొడి చర్మం కోసం:

1 tbp శనగపిండి

1 tbp ఆరెంజ్ పీల్ పొడి

1 స్పూన్ తేనె

అవసరమైనంత నీరు

తేనెతో పాటు ఈ ఫేస్‌మాస్క్ అద్భుతాలు చేస్తుంది. అన్ని పదార్థాలను కలపి పేస్ట్ ల్లా చేసి ఫేస్ కు అప్లై చేసుకోవాలి.  వారానికి 1-2 సార్లు ఇలా చేయాలి. ఇది చాలా తొందరగా ముఖ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  ముఖం మీద టాన్ తొలగించడంలో సహాయపడుతుంది. శనగపిండి చర్మాన్ని మృదువుగా చేస్తుంది తేనె మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. 

సాధారణ చర్మ రకం కోసం:

1 tbp ఆరెంజ్ పీల్ పొడి

ఒక చిటికెడు పసుపు

1 టీస్పూన్ ముల్తానీ మట్టి, అవసరమైనంత పాలు

పైన పేర్కొన్న పదార్థాలతో పేస్ట్ తయారు చేసి వారానికి ఒకసారి అప్లై చేయాలి. ముల్తానీ మట్టిని ఆరెంజ్ పీల్ ప్యాక్‌లో ఉపయోగించడం ద్వారా మీ చర్మం మీద బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ను తొలగించడానికి సహాయపడుతుంది.

ఇవి మాత్రమే కాకుండా ఆరంజ్ పీల్ పౌడర్ తో ఈ కింది ప్యాక్ లు కూడా ఉపయోగించవచ్చు. 

ఆరెంజ్ పీల్ పౌడర్, కలబంద - 

ఒక గిన్నె తీసుకొని, 2 టేబుల్ స్పూన్ల తాజాగా తీసిన కలబంద, 2 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ వేసి, 2-3 చుక్కల నిమ్మరసం పిండుకుని, పేస్ట్ చేయాలి. పేస్ట్‌ను అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. మీ ముఖాన్ని సాధారణ చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

ఆరెంజ్ పీల్ పౌడర్, చందనం -

 ఒక గిన్నె తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నారింజ గుజ్జు, ఒక స్పూన్ చందనం కలపాలి.  తర్వాత కొన్ని చుక్కల రోజ్ వాటర్, నిమ్మరసం వేసి పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్‌ను అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత  ముఖాన్ని సాధారణ చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. 

ఆరెంజ్ పీల్ పౌడర్, పెరుగు 

 ఒక గిన్నె తీసుకుని, అందులో 2 టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ తేనె మరియు 1 టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. దీన్ని మందపాటి పేస్ట్ లా చేసుకోవాలి.  పేస్ట్‌ను అప్లై చేసి 10-12 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత ముఖాన్ని సాధారణ చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ పీల్ పౌడర్, పంచదార 

ఒక గిన్నె తీసుకుని, 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, ½ టేబుల్ స్పూన్ పంచదార కలపాలి. ఇది పేస్ట్ చేయడానికి కొన్ని చుక్కల నిమ్మరసం, రోజ్ వాటర్ జోడించాలి. ఈ స్క్రబ్‌ని అప్లై చేసి 5-7 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. తరువాత ముఖాన్ని సాధారణ/చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

ఇవి పాటిస్తే.. ఈ వేసవి కాలంలో ముఖం మెరిసిపోతుంది.

                                       ◆నిశ్శబ్ద.