గుడ్డును ఇలా ఉపయోగిస్తే.. టెంకాయ పీచులా ఉన్న జుట్టు కూడా పట్టుకుచ్చులా మారుతుంది.!
జుట్టు ఆరోగ్యం విషయానికి వస్తే చాలా మంది అమ్మాయిలు బోలెడు షాంపూలు, కండీషనర్ లు వాడుతుంటారు. ఇవి జుట్టుకు బలాన్ని, పోషణను ఇస్తాయని.. జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ కనిపించేలా చేస్తాయని అంటారు. అయితే ఈ వాణిజ్య ఉత్పత్తులు అన్నీ జుట్టుకు తాత్కాలికంగా మంచి ఫలితాలు ఇచ్చినా.. ఆ తరువాత జుట్టును డ్యామేజ్ చేస్తాయి. కానీ ఇంట్లోనే సహజ పదార్థాలతో జుట్టును నేచురల్ గా సిల్కీగా మార్చుకోవచ్చు. ఇందుకోసం గుడ్డు బాగా సహాయపడుతుంది. సాధారణంగానే జుట్టు పెరుగుదల కోసం గుడ్డును ఉపయోగిస్తుంటారు చాలా మంది. కానీ టెంకాయ పీచులా రఫ్ గా ఉన్న జుట్టును కూడా పట్టు కుచ్చులా మార్చే శక్తి గుడ్డుకు ఉంది. ఇందుకోసం గుడ్డును ఎలా ఉపయోగించాలంటే..
కోడి గుడ్లలో బయోటిన్, ప్రోటీన్, విటమిన్-ఎ, విటమిన్-డి, విటమిన్-ఇ, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ మొదలైన పోషకాలు ఉంటాయి. ఈ విటమిన్లు అన్నీ జుట్టును మృదువుగా చేసి జుట్టును పట్టు కుచ్చులా మారుస్తాయి.
ఎగ్ హెయిర్ మాస్క్..
జుట్టు పట్టు కుచ్చులా మారాలంటే ఎగ్ హెయిర్ మాస్క్ ను ఉపయోగించాలి.
గుడ్డు, పెరుగు..
గుడ్డు, పెరుగు కలిపి మాస్క్ తయారు చేసి ఉపయోగించవచ్చు. ఇందుకోసం గుడ్డు సొనలో పెరుగు కలిపి బాగా కలపాలి. తరువాత దీన్ని జుట్టుకు అప్లై చేయాలి. తరువాత తలస్నానం చేయాలి. గుడ్డు వాసన కొందరిని ఇబ్బంది పెడుతుంది. కానీ గుడ్డుతో వేసే హెయిర్ ప్యాక్ మాత్రం జుట్టుకు మ్యాజిక్ ఫలితాలు ఇస్తుంది. ఇది జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది.
గుడ్డు, కొబ్బరినూనె..
గుడ్డు, కొబ్బరినూనె కలిపి మాస్క్ తయారు చేసుకుని ప్యాక్ వేసుకోవచ్చు. ఒక గుడ్డు సొనలో రెండు స్పూన్ల కొబ్బరినూనె వేయాలి. దీన్ని బాగా బీట్ చేయాలి. తరువాత తలకు, జుట్టు పొడవునా అప్లై చేయాలి. తరువాత తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు లోపలి నుండి బలపడుతుంది. రఫ్ గా ఉన్న జుట్టు రిపేర్ అవుతుంది. జుట్టు సిల్కీగా, మెరుస్తూ ఉంటుంది. ఈ రెండు హెయిర్ మాస్క్ లను వారానికి ఒకసారి లేదా 10రోజులకు ఒకసారి అప్లై చేస్తుంటే జుట్టు పెరుగుదల కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.
*రూపశ్రీ.
