జుట్టుకు కలబందతో కలిగే లాభాలు!
సీజన్ ను బట్టి స్కిన్ కేర్ టిప్స్ మారుస్తుంటారు అమ్మాయిలు. అయితే కేవలం స్కిన్ కేర్ మాత్రమే కాదు హెయిర్ కేర్ టిప్స్ కూడా పాటించాలి. మరీ ముఖ్యంగా హెయిర్ కేర్ టిప్స్ పాటించేవారు కలబంధను తప్పనిసరిగా చేరుస్తుంటారు. అయితే కలబంధను ఎలా ఉపయోగిస్తున్నాం అనేదాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. తలలో చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు పలుచగా, టెంకాయ పీచులాగా ఉండటం వంటి సమస్యలకు కలబంద గొప్ప సొల్యూషన్ అని చెప్పవచ్చు. అయితే కలబందను వాడటంలోచాలా తప్పులు కూడా చేసేస్తుంటారు. కలబంద ఎలా వాడాలి?? ఎలా వాడితే పలితం ఉంటుంది?? తెలుసుకుంటే..
కలబందను ఉపయోగించడం వల్ల జుట్టు దృఢంగా మారడమే కాకుండా మెరుస్తుంది. అలోవెరాలో విటమిన్ సి, ఇ, ఎ ఉన్నాయి. ఇది జుట్టు పొడవును పెంచడంలో కూడా సహాయపడుతుంది. అందుకే అమ్మాయిలు దీన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దీన్ని సరైన మార్గంలో ఉపయోగించడం ద్వారా జుట్టుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.
జుట్టుకు అప్లై చేయడానికి సరైన మార్గం ఏంటంటే..
ముందుగా తాజా కలబందను మొక్కనుండి వేరు చేశాక శుభ్రంగా కడుక్కోవాలి. ఆకుపచ్చరంగులో వచ్చే పదార్థం మొత్తం వెళ్లిపోయేలా దాన్ని శుభ్రం చేయాలి. కతి సహాయంతో లోపలి జెల్ ను మాత్రమే తీసుకోవాలి. కలబంద జెల్ ను పొడి జుట్టు మీద అప్లై చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జెల్‌ని జుట్టు మూలాల్లో అప్లై చేయడం మొదలుపెట్టి జుట్టు చివర్ల వరకు అప్లై చేయాలి.
కలబందను జుట్టుకు అప్లై చేసిన తర్వాత అరగంట మాత్రమే ఉంచాలి. అరగంట తర్వాత గాఢత లేని షాంపూతో కడగాలి..
కలబందను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు
కలబందను వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే, తల దురద, మంట, చుండ్రు మొదలైనవి కూడా పోతాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. కలబందను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది.
◆నిశ్శబ్ద.