మన సామర్థ్యాలని ఉపయోగించుకుని అందుకు తగ్గ అవకాశాలని మనం పొందలేకపోవటానికి నిజానికి మన భయాలే కారణం. కొత్తగా ఏదన్నా చేయాలంటే భయం ఓడిపోతామనో, అందరూ ఏమనుకుంటారనో, చేయగలమో లేదో అనో ఇలా రకరకాల భయాలు పట్టి వెనక్కి లాగుతుంటాయి. కానీ మనసులో మాత్రం నా శక్తి సామర్థ్యాలకు తగ్గ ప్రతిఫలం, గుర్తింపు నాకు దక్కటం లేదు. నేను ఇంకా చేయగలను. అవకాశం వస్తే అని మదన పడుతుంటాం. ఇక్కడ ఓ విషయం గుర్తించాలి. అవకాశాలు ఎక్కడి నుంచో రావు, అవి మనం సృష్టించుకోవాలి. అలాగే మనకి ఎదురొచ్చే అవకాశాలని గుర్తించాలి. అందుకు ఒక్కటే సూత్రం. "మార్పు".

"మార్పుకి సిద్ధంగా ఉండాలి"