Home » Beauty » అద్బుతమైన ఫేస్ మాస్క్.. రాత్రి దీన్ని అప్లై చేస్తే మ్యాజిక్కే!

అద్బుతమైన ఫేస్ మాస్క్.. రాత్రి దీన్ని అప్లై చేస్తే మ్యాజిక్కే!

అద్బుతమైన ఫేస్ మాస్క్.. రాత్రి దీన్ని అప్లై చేస్తే మ్యాజిక్కే..!


ముఖం అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.  ముఖ్యంగా ఏవైనా పార్టీలు, ఈవెంట్లు, పండుగల ముందు స్కిన్ కేర్ గురించి చాలా ఆలోచిస్తారు.  అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఫేస్ ప్యాక్ వంటి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ఇంట్లోనే మంచి ఫేస్ ప్యాక్ తో అద్బుతమైన రిజెల్ట్ పొందవచ్చు.  ముఖానికి రాత్రిపూట సహజమైన మెరుపు తీసుకురావాలనుకుంటే, ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వంటగదిలో లభించే కొన్ని సులభమైన,  సహజ పదార్థాలతో తయారు చేయబడిన  ఫేస్ మాస్క్  చర్మాన్ని పోషించడంలో, చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో,  తొందరగా ఫలితాన్ని ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది. ఆ ఫేస్ ప్యాక్ ఏంటో.. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా వాడాలో తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు..

1 టీస్పూన్ శనగ పిండి

1 టీస్పూన్ పెరుగు

 1 టీస్పూన్ తేనె

 నిమ్మరసం 2-3 చుక్కలు

 చిటికెడు పసుపు

తయారీ విధానం..

ముందుగా ఒక శుభ్రమైన గిన్నె తీసుకోవాలి. అందులో శనగపిండి, పెరుగు, తేనె కలపాలి. ఇప్పుడు దానికి నిమ్మరసం,  పసుపు కలపాలి.  అన్ని పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి.

ఉపయోగించే విధానం..

ముఖాన్ని ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకుని తేలికగా తుడవాలి.  ఇప్పుడు తయారుచేసుకున్న పేస్ట్ ను ముఖం, మెడ అంతటా సమానంగా అప్లై చేయాలి. 15
-20 నిమిషాలు ఆరనివ్వండి. వృత్తాకారంగా మసాజ్ చేస్తూ గోరువెచ్చని నీటితో కడగాలి.

ఫేస్ మాస్క్ వేసిన తర్వాత..

ముఖం కడుక్కున్న తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ రాయాలి.  పగటిపూట బయటకు వెళ్ళవలసి వస్తే, సన్‌స్క్రీన్ రాసుకోవడం మరచిపోకూడదు.  
ముఖం కడుక్కున్న తర్వాత ముఖాన్ని రుద్దకూడదు టవల్ తో మెల్లగా తుడవాలి. ఒకేసారి ఎక్కువ మేకప్ వేసుకోవడం మానుకోవాలి.

 జాగ్రత్తలు..

చర్మం చాలా సున్నితంగా ఉంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.

ఎక్కువ నిమ్మకాయను జోడించకూడదు. ఇది  మంటను  కలిగించే అవకాశం ఉంటుంది.
 గాయాలు లేదా మొటిమలు ఉంటే ఈ ఫేస్ ప్యాక్  పూయకూడదు.
వారానికి 1-2 సార్లు కంటే ఎక్కువ ఉపయోగించకూడదు.
 ఏదైనా అలెర్జీ  రియాక్షన్ కనిపిస్తే  వెంటనే వాడటం మానేయాలి.

                                         *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img