గర్భధారణ సమయంలో యోగా చేయడం వల్ల గర్భస్రావం జరుగుతుందా...

 


గర్భధారణ సమయంలో స్త్రీల మనస్సులలో అనేక రకాల భయాలు ఉంటాయి. ముఖ్యంగా ఏమి చేయడం సురక్షితం,  ఏమి చేయకూడదు, ఏమి తినవచ్చు,  ఏమి తినకూడదు వంటి వాటి గురించి చాలా భయాలు ఉంటాయి. ఈ సమయంలో ప్రయాణించడం సరైనదేనా? అదేవిధంగా, గర్భధారణ సమయంలో యోగా చేయడం ప్రయోజనకరంగా ఉంటుందా?  లేదా యోగా చేస్తే మంచిదేనా అనే గందరగోళంలో కూడా ఉంచారు.   అదేవిధంగా కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో యోగా చేయడం గర్భస్రావానికి దారితీస్తుందా అని కూడా అయోమయానికి లోనవుతారు.  యోగా అనేది ఫిట్నెస్ కు  సంబంధించిన చర్య కాబట్టి ఈ విషయం పూర్తీగా తెలుసుకుంటే మంచిది.

యోగా గురించి మహిళల విభిన్న భయాలు,  అపోహలను తొలగించడాని ప్రముఖ వైద్య నిపుణులు కొన్ని విషయాలను స్పష్టంగా తెలియజేశారు.

మొదటి త్రైమాసికం..

గర్భధారణ మొదటి త్రైమాసికంలో (0 నుండి 13 వారాలు)  యోగా చేయడం సురక్షితమని వైద్యులు అంటున్నారు. అయితే ఇది సరైన టెక్నిక్‌తో, నిపుణుల పర్యవేక్షణలో,  కొన్ని ఆసనాలను మాత్రమే  చేయడం మంచిది. అలా కాకుండా సొంతంగా చేయడం చాలా ప్రమాదం.

శ్వాస వ్యాయామాలు మేలు..

గర్భధారణ  సమయంలో మహిళలు సున్నితమైన,  బుద్ధిపూర్వక యోగాను అవలంబించవచ్చని డాక్టర్ చెబుతున్నారు, శ్వాస వ్యాయామాలు,  తేలికగా శరీరాన్ని  సాగతీసే  భంగిమలు శరీరానికి,  మనసుకు ఉపశమనం కలిగిస్తాయి.

ఆధారాలు..

సున్నితమైన,  తేలికైన యోగా సులభంగా గర్భస్రావం కలిగిస్తుందని నిరూపించడానికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవట.  వాస్తవానికి యోగా సరైన టెక్నిక్,  జాగ్రత్తతో చేస్తే, అది గర్భిణీ స్త్రీలకు సురక్షితంగా ఉండటమే కాకుండా నివారణగా కూడా ఉంటుంది.

తీవ్ర వ్యాయామాలు..

గర్భధారణ ప్రారంభ దశలో మహిళల శరీరంలో ప్రధాన హార్మోన్ల మార్పులు జరుగుతాయని, దీని కారణంగా అలసట, తలతిరుగుడు లేదా వికారం వంటి ఫిర్యాదులు సర్వసాధారణమని  వైద్యులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో అధిక తీవ్రత కలిగిన వ్యాయామాలను నివారించాలి, ఎందుకంటే ఇది శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి వ్యాయామాలు, యోగా చేసే విషయంలో గర్భం దాల్చిన మహిళలు వైద్యుల సలహా లేకుండా ఏదీ చేయకూడదు.

                                      *రూపశ్రీ.