ఎలాంటి పరికరాలు వాడకుండా రింగుల జుట్టు కావాలా...ఇదిగో ఇలా చేయండి..!

 


హెయిర్ స్టైల్స్ అంటే అమ్మాయిలకు చాలా క్రేజీ.. ఒక్కో శుభకార్యానికి ఒకో విధమైన హెయిర్ స్టైల్ లో,  డ్రస్సింగ్ ను బట్టి హెయిర్ స్టైల్స్ మారుస్తూ చాలా అట్రాక్షన్ గా కనపడాలి అనుకుంటారు.  ముఖ్యంగా కర్లింగ్ హెయిర్ కు చాలా డిమాండ్ ఉంది.  చాలామంది కర్లింగ్ హెయిర్ కోసం మార్కెట్ లో లభించే హెయిర్ స్ట్రైయిటర్,  హెయిర్ కర్లర్ వాడుతూ ఉంటారు.  ఇవి వేడి కారణంగా జుట్టును స్ట్రైయిట్ గా చేయడం లేదా జుట్టును రింగురింగులుగా మార్చడం చేస్తాయి. అయితే ఈ పరికరాలతో పని లేకుండా సాధారణంగానే హెయిర్ కర్లింగ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుంటే..

షాంపూ తర్వాత..

షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టును కంప్లీట్ గా ఆరబెట్టకూడదు.  లైట్ గా ఆరబెట్టిన తర్వాత జుట్టుకు డ్యామేజ్ కాకుండా మెల్లిగా దువ్వాలి.  చిక్కులు లేకుండా జుట్టును దువ్విన తర్వాత చెవుల కింద నుండి మొదలు పెట్టి జుట్టును పాయలు తీసుకుంటూ తల చుట్టూ గట్టిగా చుట్టాలి.

రోలర్స్ వాడటం..

రోలర్స్ ఉపయోగించి జుట్టును కర్ల్ చేయవచ్చు.  కొద్దిగా తడిగా ఉన్న జుట్టుకు లీవ్ ఇన్ కండిషనర్,  మూస్ ను అప్లై చేయాలి.  జుట్టును పెద్ద భాగాలుగా డివైడ్ చేసి వాటిపై వెల్క్రో రోలర్లను ఉంచాలి.  ఇవి జుట్టును కర్ల్ చేయడంలో సహాయపడతాయి.

రబ్బర్ బ్యాండ్స్ తో..

తలస్నానం తర్వాత కొద్దిగా తడిగా ఉన్న జుట్టును చిక్కులు తీసి పోనీ టైల్ కట్టాలి.  పోనీ టైల్ పొడవునా మృదువైన హెయిర్ టైలు లేదా రబ్బరు బ్యాండ్ లను ఉంచాలి.  జుట్టు పూర్తీగా ఆరగానే జుట్టు కర్ల్స్ చూడొచ్చు.


                                                *రూపశ్రీ.