ఆఫీస్ లవ్ బర్డ్స్ ఈ పనులు చేస్తే తంటాలు తప్పువు!

 


ఇప్పటికీ ఇండియాలో వెస్టన్ కల్చర్ అంటే ముఖం చిట్లిస్తారు.పాశ్చాత్య సంస్కృతి అంటే బూతు పదం అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇస్తారు. కాని,ఫ్యాక్ట్ ఏంటంటే వద్దు వద్దంటూనే మన వాళ్లు ఎప్పుడో అమెరికనైజ్ అయిపోయారు. మన సినిమాల్లో హీరోయిన్స్ కన్నాంబ నుంచీ కత్రీనా కైఫ్ దాకా ఛేంజ్ అవుతూ వచ్చారు. అలాగే మన సమాజం కూడా మారిపోతూ వస్తోంది. ఇది మంచికా చెడుకా అనేది పెద్ద చర్చ.కాని,దాన్ని మనం ఎదుర్కోక తప్పదు. మనల్ని మనం అడ్జెస్ట్ అండ్ అప్డేట్ చేసుకోక తప్పదు.


మన దేశంలో పెరిగిపోయిన వెస్టన్ కల్చర్ లో భాగంగా ఇప్పుడు రిలేషన్ షిప్సు,బ్రకప్స్  కూడా మామూలైపోయాయి. ఉద్యోగం చేసినంత కామన్ గా ఆఫీసుల్లో రొమాన్స్ లు కూడా నడిపించేస్తున్నారు యూత్.అందులో సీరియస్ ప్రేమలు ఎన్ని,సరదాగా కొనసాగించేవి ఎన్ని అనేది ఎవ్వరికీ తెలియదు. కాని, కారణం ఏదైనా ఆపీస్ లో లవ్ స్టోరీ మొదలెడితే తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని వుంటాయి.మరీ ముఖ్యంగా, అమ్మాయిలు పాటించాల్సిన సూత్రాలేవో ఇప్పుడు చూద్దాం... 


లవ్వర్స్ ఇద్దరూ ఆఫీస్ లో ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు పనిని,ప్రేమని అస్సలు కలవనివ్వద్దు. ఇది చెప్పినంత ఈజీకాకున్నా ప్రేమ, దాని వల్ల పుట్టే భావోద్వేగాలు పనిని ప్రభావితం చేస్తే అనేక ఇబ్బందులు మొదలవుతాయి.దీర్ఘకాలంలో అనేక చికాకులకు దారి తీస్తుంది. ఇక మరో ముఖ్య విషయం,మీ రిలేషన్ షిప్ ని పది మందికి తెలిసేలా ప్రవర్తించకండి. ప్రేమలో వున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ సంగతి లోకమంతా తెలిసిపోతుంటుంది. అందుకు, ప్రేమలో మునిగితేలుతున్న లవ్ బర్డ్స్ బిహేవియరే కారణం. కాబట్టి సాధ్యమైనంత వరకూ మీ బంధాన్ని పర్సనల్ గా వుంచటానికీ ప్రయత్నించండి. దీని వల్ల అందరి దృష్టీ మీ మీద అనవసరంగా పడకుండా వుంటుంది. 


ఈ మధ్య అగ్ని సాక్షిగా చేసుకున్న పెళ్లిల్లే కోర్టులు,జడ్జీల సాక్షిగా పెటాకులైపోతున్నాయి. మరి ఆఫీస్ లో మొదలైన అట్రాక్షన్స్ శాశ్వతంగా వుంటాయా? వుండే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకే, మీరు మీ పార్టనర్ తో బ్రేకప్ కు సిద్ధమైతే గౌరవంగా, గంభీరంగా విడిపోండి. అంతే తప్ప ఎంత ఎక్కువగా గొడవలు పడి విడిపోతే అంత ఇబ్బందిగా వుంటుంది. తరువాతి పరిస్థితి!బ్రేకప్ తరువాత ప్రతీ రోజూ ఆఫీస్ లో మీరు ఒకర్నొకరు చూసుకుంటూ పని చేయాల్సి వుంటుందని మరిచిపోకండి.


ఆఫీస్ లో ఒక జాబ్ చేస్తున్నప్పుడు సహజంగానే కొన్ని అధికారాలు లభిస్తూ వుంటాయి. వాట్ని ఎప్పుడూ ప్రేమ కోసం,ప్రియుడి కోసం ఉపయోగించకండి. అలా చేస్తే ఏనాటికైనా ఆఫీస్ లోని మిగతా వారంతా చెవులు కొరుక్కోవటం మొదలెడతారు. సాధారణంగా ఒక స్త్రీ తనకంటే పై స్థాయిలో వున్న వ్యక్తితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తే ఆమెకు లభించే ప్రయోషన్, అప్ రైజల్ అన్నీ అతడి చలువే అనటం జనాల బలహీనత.ఇది జరగకూడదంటే జాబ్ ని ఎంత క్రమశిక్షణతో చేస్తే అంత మంచిది.


లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే... రొమాంటిక్ రిలేషన్ షిప్స్ అన్నాక ఫిజికల్ అట్రాక్షన్ సహజంగానే వుంటుంది. కాని, దాన్ని అదుపులో వుంచుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఆఫీస్ లో వున్న కొలీగ్ తో సంబంధం వున్నంత మాత్రాన ఆఫీస్ పరిసరాల్లో హాట్ రొమాన్స్ అస్సలు మంచిది కాదు. మగవారికన్నా ఇది ఆడవారికే ఎక్కువ ఇబ్బంది, అపవాదు తెస్తుంది.కాబట్టి,ముద్దు మురిపెం అన్నీ ఆఫీస్ టైమింగ్స్ అయ్యాక ఆఫీస్ కి ఆవలే...