పిల్లలు కలగడం లేదా ఈ ఆసనాలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది!
posted on Mar 14, 2024
పిల్లలు కలగడం లేదా ఈ ఆసనాలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది!
పెళ్ళైన ప్రతి జంట తల్లిదండ్రిగా మారాలని అనుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికాలంలో సంతానలేమి సమస్య చాలా తీవ్రంగా ఉంది. తల్లి కనాలనే అమ్మాయిల కలలు ఆలాగే ఉండిపోతున్నాయి. ప్రస్తుతకాలంలో ఉన్న జీవన శైలి, ఆహారం విషయంలో జరిగే పొరపాట్లు, మరీ ముఖ్యంగా శరీరంలో హార్మోన్ల సమస్యల కారణంగా అమ్మయిలకు గర్భం దాల్చడంలో సమస్యలు వస్తున్నాయి. అయితే కొన్ని యోగాసనాలు ఈ సమస్యను దూరం చేస్తాయి. కింద చెప్పుకునే ఆసనాలు వేయడం వల్ల అమ్మయిలలో సంతాన సామర్థ్యము పెరుగుతుంది. ఇందుకోసం వెయ్యాల్సిన ఆసనాలు ఏవంటే..
సూర్య నమస్కారం
యోగాసనాలు రుతుక్రమంలో లోపాలు తగ్గించడంలో, మెనోపాజ్ సమయంలో సంభవించే సమస్యలలో సహాయపడతాయి. బహిష్టు నొప్పిని తగ్గించుకోవడానికి సూర్య నమస్కారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. స్త్రీ గర్భాశయంపై, పిల్లల పుట్టుకపై నెలసరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెలసరి విషయంలో సమస్యలు లేకుంటే గర్భం దాల్చడంలో సమస్యలు తక్కువే ఉంటాయి. సూర్య నమస్కారం లైంగిక గ్రంధులను క్షీణించే సమస్య నుండి దూరంగా ఉంచుతుంది. ఇందువల్ల గర్భం దాల్చడంలో సహాయపడుతుంది.
బద్ద కోణాసనం
బద్ద కోనాసనను సీతాకోకచిలుక భంగిమ అంటారు. ఈ ఆసనం లోపలి తొడలు, తుంటి ప్రాంతం మరియు మోకాళ్ల కండరాలను ప్రభావితం చేస్తుంది. శరీరం దృఢంగా మారడంతో సహాయం చేస్తుంది.. బద్ధ కోనాసనం వేయడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది. ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించడంలో కూడా ఈ ఆసనం ప్రభావవంతంగా ఉంటుంది.
పశ్చిమోత్తనాసనం
పశ్చిమోత్తనాసనం కండరాలను సాగదీస్తుంది.ఈ ఆసనం సాధన చేయడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది మరియు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
బాలసనా
సంతానోత్పత్తి సమస్య నుండి బయటపడటానికి, బాలసనాను మంచి మార్గం. ఈ యోగాసనం రక్త ప్రసరణను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాకుండా, ఈ ఆసనం ద్వారా వెనుక, మోకాళ్లు, తుంటి మరియు తొడల కండరాలు సాగుతాయి.
ఈ ఆసనాలు వేస్తే గర్భం దాల్చే విషయంలో ఇబ్బందులు పడే మహిళలకు తొందరలోనే మంచి ఫలితాలు ఉంటాయి.
◆నిశ్శబ్ద.