ఆదర్శంగా నిలుస్తున్న మహిళా వ్యాపార వేత్తలు
posted on Oct 21, 2013
కొంత మంది విజయం చాలా మందికి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఎక్కడో, ఎవరో... వాళ్ళు మనకి నేరుగా పరిచయం ఉన్నవారు కాదు.. కానీ వారి వృత్తిలో మెట్లు ఎక్కుతూ, అంతెత్తుకు చేరుతుంటే....ఏదో ఆనందం మనమే ఏదో సాధించినట్టు... ఎందుకిలా?
ఎందుకంటే అది అసాధ్యమేమీ కాదని నిరూపించారు. రేపు మనము అలా ఎదగచ్చేమో? అన్న ఆశని మనలో నింపుతారు కాబట్టి ఫార్చ్యూన్ మ్యాగజైన్... ఒక వ్యక్తి వ్యాపార, వృత్తి, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు వంటి అంశాల ఆధారంగా అంతర్జాతీయ అగ్రశ్రేణి వ్యాపారవేత్తల జాబితాను సిద్ధం చేస్తుంది. ఆ జాబితాలో మహిళా వ్యాపార వేత్తల జాబితాలో మన దేశం నుంచి నలుగురు భారతీయ మహిళలకు స్థానం దక్కింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వ్యాపార జాబితాలో ICICI బ్యాంక్ CEO చందాకోచర్ నాలుగో స్థానంలో నిలిచారు.
అలాగే National Stock Exchange Chief చిత్రా రామకృష్ణన్ 17వ స్థానంలో ఉన్నారు.
యాక్సిస్ బ్యాంక్ శిఖాశర్మ 32వ స్థానంలో ఉన్నారు.
HSBC నైనా లాల్ కిద్వాయ్ 42వ స్థానంలో ఉన్నారు.
ప్రపంచ వ్యాప్త మహిళా వ్యాపార దిగ్గజాలతో పోటీపడుతూ... ఇలా తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందటం అంత సులువేం కాదు. అలా అని అసాధ్యమూ కాదని నిరూపించారు. ఈ నలుగురి ప్రస్థానం.... వారి అభిరుచులు, వృత్తిపట్ల, వ్యక్తిగత జీవితం పట్ల వారి దృక్పథం... ఇవన్నీ ఎందరో మహిళలకు స్పూర్తినిచ్చే అంశాలు. వారికి అభినందనలు తెలుపుతూ, వారి స్పూర్తితో... మన లక్ష్యాలని నిర్ణయించుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నిద్దాం..
- రమ
Teluguone