Skin Diseases in Children
posted on Jul 19, 2012
Skin Diseases in Children
చిన్న పిల్లల్లో... చర్మ వ్యాధులు
సాధారణంగా చిన్న పిల్లల్లో ఎరితిమా, ఎక్జిమా, హెర్పిస్, సోరియాసిస్, అర్టీకేరియా
మరియు గజ్జి, తామర అనబడే వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధుల్లో సాధారణంగా చర్మంపై
నల్లమచ్చలు, ఎర్రమచ్చలుగా, పొడిగా లేదా కారడం, చర్మంపై పొలుసుగా రావడం
మొదలైన లక్షణాలు ఆయా జబ్బులు బట్టి వస్తాయి. కొన్ని చర్మవ్యాధులు కొన్ని కొన్ని
చోట్ల వస్తాయి. గజ్జి వ్యాధిలో చేతి వేళ్లలో, తొడ లోపలి భాగంలో మరియు శరీరం ఇతర
భాగాలలో వ్యాపిస్తుంది.
‘సొరియాసిస్’లో పొలుసుగా పొడి చర్మం వస్తుంది. ‘ఎరితిమా’ వ్యాధిలో చర్మం ఎర్రబడి
దురదగా ఉంటుంది. అర్టికేరియాలో దద్దుర్లు వస్తాయి. ఒళ్లంతా రావచ్చును. విపరీతంగా
దురద వస్తుంది.
‘ఎక్జిమా’ వ్యాధి ముఖ్యంగా కీళ్ల మలుపులో వస్తుంది. పొట్ట, వీపు, కాళ్లు, చేతుల్లో,
మెడ వద్ద వస్తుంది.
కారణాలు: ఎలర్జీ వల్ల, వాతావరణ మార్పుల వల్ల, తినే వస్తువులలో కొన్ని పడకపోవడం
వల్ల, శుభ్రత సరిగా లేకపోవడం వల్ల, వంశపారపర్యంగా, ఫంగస్ వల్ల మొదలైన ఎన్నో
కారణాల వల్ల మానసికంగా కుంగిపోవడం వల్ల కూడా చర్మవ్యాధులు ఎక్కువవుతాయి.
హోమియోపతి వైద్యం:
* ఆర్సనిక్ ఆల్బమ్: ముఖంపైన, తలలో పొడిగా, పొలుసుగా చర్మవ్యాధి, పస లాంటి
డిస్‌చార్జి ఉంటుంది. విపరీతమైన మంట, దురదలు ఉంటాయి. ఈ పిల్లలు చాలా నీరసంగా
ఉంటారు. దాహం ఎక్కువ. చలి వాతావరణం పడదు. ఆందోళన, భయం ఎక్కువ. అన్ని
రకాల చర్మవ్యాధులకు ఇది ముఖ్యమైన మందు.
* గ్రాఫైటిస్: ఎక్జిమా, సోరియాసిస్ వ్యాధులకు ముఖ్యమైన మందు. ఈ పిల్లలు లావుగా,
బొద్దుగా ఉం టారు. చర్మం మందంగా ఉంటుంది. నల్లని మచ్చలు ఏర్పడతాయి. దురదగా
ఉంటుంది. చర్మం నుండి కారడం ఉంటుంది. వీరికి మలబద్దకం ఎక్కువ. చర్మంలో పగుళ్లు
ఉంటాయి.
* హెపర్ సల్ఫ్: తలో ఎక్జిమాకు ముఖ్యమైన మంది. వీరు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు.
చర్మాన్ని ముట్టుకున్న నొప్పిగా ఉంటుంది. జననాంగాల వద్ద ఎక్జిమా, ఎరితిమా
వ్యాధులకు ముఖ్యమైన మందు.
* కాలమూర్: ఎక్జిమా ముఖ్యమైన మందు. ఇక్కడ తెల్లని డిస్‌చార్జి ఉంటుంది.
* రస్‌టాక్స్: ‘అర్టికేరియా’కు ముఖ్యమైన మందు. చర్మం ఎర్రబడి దద్దుర్లు వస్తాయి.
దురదగా ఉంటుంది. తేమ వాతావరణంలో ఎక్కువవుతుంది.
* సల్ఫర్: చర్మవ్యాధులకు ఇది సర్వరోగ నివారిణి లాంటిది. ఏ వ్యాధి అయినను దానిని
సమూలంగా తొలగించుటకు ఒక స్టేజ్‌లో ఈ మందును ఇవ్వవలసి ఉంటుంది. వీరికి
మలబద్దకం ఎక్కువ. పరిశుభ్రత తక్కువ. చల్లగాలి పడదు. రాత్రిపూట దురదులు ఎక్కువ.
మంటగా ఉంటుంది. గోకినచో ఉపశమనంగా ఉంటుంది. గజ్జి, తామరకు ముఖ్యమైన
మందు.
* ఆంటమొనియమ్ క్రూడ్: సోరియాసిస్‌కు ముఖ్యమైన మందు. ఈ పిల్లలు లావుగా
ఉంటారు. తినడం ఎక్కువ. పని తక్కువ.సోమరిపోతులు. నాలుకపై తెల్లని కోటింగ
ఉంటుంది. వేడి వల్ల చర్మవ్యాధి ఎక్కువవుతుంది.ఇవే కాకుండా ఆర్సనిక్ అయోడ్,
డల్‌కమరా, మెర్కూరియస్, నాట్రరిమూర్, బొవిస్టా, ఏపిస్, సెపియా, ఆర్టికా యూరెన్స్,
మెజీరియం మొదలైన హోమియోపతి మందులు వాటి రోగ లక్షణాలను బట్టి
ఉపయోగించవచ్చు.