సంపూర్ణ ఆరోగ్యానికి జీడిపప్పు

 

సంపూర్ణ ఆరోగ్యానికి జీడిపప్పు

ప్రతి ఒక్కరు తమ మెనూలో ఉండేలా చూసుకోవాల్సిన ఆహారం జీడిపప్పు. జీడిపప్పును కంప్లీట్ ఫుడ్ ప్యాక్‌గా చెప్పుకోవచ్చు. అనేక పోషకవిలువలు జీడిపప్పులో ఉన్నాయి. ఫైబర్, విటమిన్స్, మినరల్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడే ఫైటో కెమికల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రోజు జీడిపప్పు తినే వారిలో మంచి కొలెస్టరాల్ శాతం ఎక్కువగా ఉంటుంది.

కొలెస్టరాల్, గుండెజబ్బులు:
జీడిపప్పులో గుండెకు రక్షణనిచ్చే మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులోని ౖఔఉఐఇ, ్కఅఔకఐఖీౖఔఉఐఇ అఇఐఈఖి బ్యాడ్ కొలెస్టరాల్‌ను(ఔఈఔ) తగ్గించడంలోనూ, మంచి కొలెస్టరాల్‌ను(ఏఈఔ) పెంచడంలోనూ ఉపయోగపడతాయి. మెడిటేరియన్ డైట్‌లో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండి గుండెజబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధనల్లోసైతం వెల్లడయింది.

మినరల్స్ డెఫిషియెన్సీ:
జీడిపప్పులో మాంగనీస్, పోటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు జీడిపప్పు తీసుకోవడం వల్ల మినరల్ డెఫిషియెన్సీ రాకుండా చూసుకోవచ్చు.

యాంటీ అక్సిడెంట్:
సెలీనియం చాలా ముఖ్యమైన పోషకపదార్థం. ఇది గ్లూటాథయోన్ పెరాక్సిడేసెస్ వంటి యాంటీఅక్సిడెంట్ ఎంజైమ్స్‌కి కో-ప్యాక్టర్‌గా పనిచేస్తుంది. ఈ ఎంజైమ్ శరీరంలో అత్యంత శక్తివంతమైన యాంటీ అక్సిడెంట్‌లలో ఒకటి. కాపర్ కూడా సైటోక్రోమ్ సి-అక్సిడేస్, సూపర్అక్సైడ్ డిస్‌మ్యూటేస్ వంటి ప్రాణాధార ఎంజైమ్‌లకి కో-ఫ్యాక్టర్‌గా పనిచేస్తుంది. జింక్ చాలా ఎంజైమ్‌లకి కో-ఫ్యాక్టర్‌గా పనిచేస్తుంది. పెరుగుదల, జీర్ణక్రియ వంటి పనులు సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.

స్పెర్మటోజెనెసిస్: ప్రతిరోజు పది జీడిపప్పు పలుకులు తింటే వీర్యకణాల ఉత్పత్తి పెరుగుతుంది. స్పెర్మ్‌కౌంట్ తక్కువగా ఉన్నవారికి జీడిపప్పు మంచి ఆహారం. ఒకనెలరోజుల పాటు జీడిపప్పు తీసుకుని ఆ తరువాత సెమన్ అనాలసిస్ చేయించుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. సంతానలేమితో బాధపడే వారికి జీడిపప్పు తప్పక తీసుకోవాలి.
విటమిన్ల మిశ్రమం: జీడిపప్పులో పాంటోథెనిక్ యాసిడ్(విటమిన్-బి5), పిరిడాక్సిన్(విటమిన్-బి6), రైబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ విటమిన్లు శరీరానికి చాలా అవసరం.
కళ్ల సమస్యలు: జీడిపప్పులో అనేక ముఖ్యమైన ఫ్లేవనాయిడ్ యాంటీఅక్సిడెంట్ ఉంటుంది. ఇది వయస్సు పెరిగిన కొద్దీ వచ్చే కళ్ల సమస్యల నుంచి రక్షిస్తుంది.