మహిళలు ప్రతి రోజూ 5 నిమిషాలు శీర్షాసనం వేస్తే ఇన్నిలాభాలుంటాయని తెలుసా!

మహిళలు  ప్రతి రోజూ 5 నిమిషాలు శీర్షాసనం వేస్తే ఇన్నిలాభాలుంటాయని తెలుసా!

 


మనిషి ఆరోగ్యానికి యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి.  వీటిలో ఉండే ఒక్కో ఆసనానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.  కొన్ని అసనాలు వేయడం వల్ల ఉమ్మడి లాభాలు కూడా ఉంటాయి. సెలెబ్రిటీల నుండి సాధారణ వ్యక్తుల వరకు చాలామంది ఫాలో అయ్యే ఆసనం శీర్షాసనం. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. కాళ్లను పైకి ఎత్తి, తలను నేలమీద ఉంచి కాళ్లను నిటారుగా ఉంచడమే శీర్షాసనం. మహిళలు ప్రతిరోజూ ఓ  5నిమిషాలు శీర్షాసనం వేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే..

రక్తప్రసరణ..

శీర్షాసనం వేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. తల కిందకు, పాదాలు పైకి ఉండటం వల్ల గురుత్వాకర్షణ శక్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది. రక్తం దిగువ భాగంలో చేరకుండానూ, రక్తం గడ్డకట్టకుండానూ నిరోధించడానికి గురుత్వాకర్షణ శక్తి సహాయపడుతుంది. కాబట్టి  శీర్షాసనం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మరీ ముఖ్యంగా శీర్షాసనం వేయడం వల్ల తలకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

వాపులు తగ్గుతాయ్..

చాలామంది మహిళలలో కాళ్ళలో వాపులు కనిపిస్తుంటాయి. దీనికి కారణం కాళ్లలో నీరు పేరుకుపోవడం. అయితే ఈ సమస్య ఉన్నవాళ్లు రోజులో 5 నిమిషాలు శీర్షాసనం వేయడం వల్ల  ప్లూయిడ్ రిటెన్షన్ అనే సమస్యని అధిగమించడం సులువు అవుతుంది. దీని కారణంగా కాళ్లలో నీరు చేరడమనే సమస్య కూడా తగ్గుతుంది. మరొక బెనిఫిట్ ఏంటంటే.. జీర్ణవ్యవస్థకి రక్తప్రసరణ పెరగడం వల్ల జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది.

ఉబ్బిన నరాలకు చెక్..

కొంతమంది మహిళలలో కాళ్లు, చేతులలో నరాలు ఉబ్బి నీలం రంగులో కనిపిస్తూ ఉంటాయి. దీన్ని వెరికోస్ వెయిన్స్ అని అంటారు. ఈ సమస్య ఉన్నవారు రోజూ 5 నిమిషాలు శీర్షాసనం వేయడం వల్ల కాళ్లలోని నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా ఈ నరాలు ఉబ్బడం అనే సమస్య పరిష్కారం అవుతుంది. అదే విధంగా సిరల సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది మంచిది.

నొప్పులకు చెక్..

నొప్పులు చాలామందిలో సహజం. తుంటి నొప్పి, నడుము నొప్పి వంటివి చాలామందిలో ఉంటాయి. ఈ నొప్పుల నుండి ఉపశమనం కలిగించడంలో శీర్షాసనం సహాయపడుతుంది.  తుంటి ప్రాంతం, నడుము మొదలైన ప్రాంతాలలో ఒత్తిడి తగ్గి  నొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.  ఇది మాత్రమే కాదు.. రోజూ వర్కౌట్ చేసే మహిళలకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలసట నుండి రిలాక్స్ కావడానికి ఇది మంచి మార్గం.

నిద్రకు ఔషదం..

శీర్షాసనం వల్ల నిద్ర సమస్యలు దూరం అవుతాయి. ఇది కండరాలకు, శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. ఉబ్బిన కళ్లకు కూడా ఇది మంచి వర్కౌట్ లాగా పనిచేస్తుంది.  ఎలాగంటే.. ముఖంలో ఉండే కణజాలలో ద్రవాలు పేరుకుపోవడాన్ని ఇది నివారించడంలో సహాయపడుతుంది.

                                          *నిశ్శబ్ద.