మహిళ త్రిపాత్రాభినయం... అదే నయం

మహిళ త్రిపాత్రాభినయం... అదే నయం..!

 



‘‘అటు ఉద్యోగం, ఇటు ఇల్లు, మధ్యలో పిల్లల అల్లరి... ఇన్నిటిని సమర్థించుకుంటూ వచ్చేసరికి ప్రాణం పోతోంది’’ అని ఒక్కసారన్నా అనుకున్నారా? అయితే వినండి.. అవే మీ ప్రాణాల్ని నిలబెట్టి మిమ్మల్ని ఆరోగ్యంగా వుంచుతున్నాయట.

వివరంగా చెప్పాలంటే...


ఇంటికే పరిమితమైన ఆడవారి కంటే, గృహిణిగా, తల్లిగా, ఉద్యోగినిగా త్రిపాత్రాభినయం చేసేవాళ్ళ ఆరోగ్యమే మెరుగ్గా వుంటుందని సాస్కోచ్‌వాన్ విశ్వవిద్యాలయం నిరూపించింది. ఈ సంస్థ నిర్వహించినన అధ్యయనంలో ఉద్యోగినుల్లోనే ఆరోగ్య సమస్యలు తక్కువగా వున్నట్టు తేలింది. అయితే మానసిక ఒత్తిడి ప్రభావం శారీరక ఆరోగ్యంపై కూడా ఉంటుంది కాబట్టి సరైన సమయపాలన, ప్లానింగ్, పౌష్టికాహారం, వ్యాయామం వంటివి ఉద్యోగినిని మానసికంగా, శారీరకంగా కూడా ఆరోగ్యంగా వుంచుతాయన్న చిన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నారు అధ్యయనకారులు.

- రమ