Vendi Vakili Bayata Darshaneeya Sthalalu Related
Home »Vendi Vakili Bayata Darshaneeya Sthalalu » Tirumala Raya Mandapam
?>

తిరుమల రాయ మండపం

Tirumala Raya Mandapam

 

రంగ మండపానికి పశ్చిమాన ధ్వజస్తంభ మండపానికి ముఖం చేసి ఉన్న విశాలమైన కాంప్లెక్సు ను తిరుమల రాయ మండపం లేదా ఉంజాల్ మండపం అంటారు. ఇది రెండు ఎత్తుల్లో ఉంటుంది. అన్నా ఉంజాల్ తిరునాళ్ గా పిలవబడే శ్రీ వెంకటేశ్వర మహోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు తిరుమల రాయ మండపాన్ని క్రీస్తుశకం 1473లో సాళువ నరసింహ రాయలు కట్టించాడు. అరవీటి బుక్కరాయ రామరాజు, శ్రీరంగ రాజు, తిరుమల రాజులు ఈ మండపాన్ని మరింత అభివృద్ధి చేశారు.

 

తిరుమల రాయ మండపంలో ఉత్సవ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (Sridevi, Bhoodevi Sameta Malayappa Swami) కొలువై ఉంటాడు. మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆస్థానం లేదా వార్షిక దర్బార్ ఇక్కడే నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో పంచిపెట్టే ప్రసాదాన్ని ఇప్పటికీ తిరుమల రాయని పొంగల్ అంటారు.

 

తిరుమల రాయ మండపం కట్టడపు స్తంభాలు విజయనగర వాస్తు శైలికి నిదర్శనంగా ఉన్నాయి. కేంద్రంలో ఉన్న స్తంభం చుట్టూ చిన్న స్తంభాలు ఉంటాయి. ఇవి సంగీతం పొదిగి ఉన్న మహాద్భుత స్తంభాలు. ఒక రాతితో వీటిపై రుద్దితే సంగీతం ధ్వనిస్తుంది. ప్రధాన స్తంభాలపై గుర్రాలు, సైనికులను చెక్కారు. తిరుమలకు చెందిన మహా శిల్పాల్లో కొన్ని ఇక్కడ దర్శనమిస్తాయి. మండపంలో ఒక మూల తోడరమల్లు, అతని తల్లి మాతా మోహనాదేవి, భార్య పిఠా బీబీ కంచు విగ్రహాలను ప్రతిష్టించారు.

Tirumala Raya Mandapam, Tirumala Raya Mandapam at Ranga Mandapam in Tirumala, Tirumala Raya Mandapam in Tirumala,Tirumala Raya Mandapam Complex of pavilions