.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-53లో.....అంజలి దగ్గరకు రాకీ వచ్చి తన మనసులోని మాట చెప్తాడు. నువ్వు కూడా నీ మనసులోని మాట చెప్పడానికి రాత్రి టెర్రస్ పైకి రా అని అంటాడు. దీంతో అంజలి భయపడుతుంది.
మరోవైపు అంజలి కోసం రేవతి బాధపడుతోందని ఆమెను తిరిగి రప్పించడం కోసం రేవతిని దత్తత తీసుకున్న ఉష, తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అంజలి ఎక్కడున్నా ఈ పోస్ట్ చూసి వస్తుందని రేవతితో ఉష చెప్తుంది. మరోవైపు అంజలి కోసం రాకీ టెర్రస్ పై వేచి చూస్తాడు. అంజలి మాత్రం రత్నం గదిలో నిద్రపోతుంది. ఎంతసేపటికీ అంజలి రాకపోవడంతో రాకీ వచ్చి తలుపుకొడతాడు. అయినా అంజలి తలుపు తీయదు.
మరుసటి రోజు ఉదయం అంజలి లేచి ముగ్గు వేస్తుండగా రాకీ వచ్చి.. ఎందుకు రాలేదు.. ఎంతసేపు వెయిట్ చేశాను.. ఇప్పుడు చెప్పు నీ మనసులోని మాట అని అడుగుతాడు. అప్పుడే గీత లేచి అలారం కొడుతుంది. దీంతో అందరు రెడీ అయి యోగా చేయడానికి వస్తారు. అంజలి దగ్గర నుంచి రాకీ వెళ్ళిపోతాడు.అందరు వచ్చారు.. భవిత ఎక్కడ అని గీత కోప్పడుతుంది. భవిత లేట్ గా వచ్చి అంజలి వేసిన ముగ్గు దగ్గర కూర్చొని తనే వేస్తున్నట్లు నటిస్తుంది.
నువ్వు వేయలేదని తెలుసని గీత అంటుంది. అబద్ధం చెప్పినందుకు భవితకు పనిష్మెంట్ ఇస్తుంది. అత్తయ్యా, ఆ ముగ్గు వేసింది అంజలి అని మనీష్ చెప్తాడు. ఇంట్లో అంతమంది పనివాళ్లు ఉన్నారు.. ఎవరు వేస్తే ఏంటని గీత కోపంగా అంటుంది.
తరువాయి భాగంలో పనిమనిషి ఫుడ్ ప్రిపేర్ చేయలేదని తెలిసి.. ఈ రోజు నేనే చేస్తానని గీత కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తుంది. అదంతా చూసిన అంజలి, రత్నం దగ్గరకు వెళ్లి.. వంట మనిషి రాకుండా చెయ్యి అమ్మమ్మ.. రేపటి నుంచి నేనే వంట చేస్తానని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

