
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -92 లో.... మనీష్ కోసం భవిత కాస్ట్లీ వాచ్ గిఫ్ట్ ఇవ్వాలని తీసుకొని వస్తుంది. ఈ వాచ్ గిఫ్ట్ ఇవ్వడంతో బావకి నాపై ఉన్న కోపం మొత్తం పోతుందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనీష్ వస్తుంటే బావ కళ్ళు మూసుకోమని చెప్పి చెయ్ చాపమని చెప్తుంది. మనీష్ చేతికి ఉన్నా వాచ్ చూసి ఇలాంటి చీఫ్ వాచ్ నువ్వు పెట్టుకోవు కదా బావ ఎవరు ఇచ్చారు.. ఇంత చీఫ్ గిఫ్ట్ అని భవిత అడుగుతుంది.
అంజలి ఇచ్చింది.. అయినా ఎవరు ఇచ్చారని అడగాలి కానీ చీఫ్ గిఫ్ట్ అంటావేంటని మనీష్ అంటాడు. అయినా పనిమనిషి నీకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటని భవిత అనగానే ఎందుకు అంజలి అంటే అంత చిన్నచూపు.. నువ్వు ముందు ఆలోచన విధానం మార్చుకోవాలని మనిష్ చెప్తాడు. మరొకవైపు రాకీ ఇంట్లోనే డ్రింక్ చేసి వాసనా రాకుండా చాక్లెట్ తింటాడు. అంతేకాకుండా రోహిత్ ని కూడా తాగమని చెప్తాడు. రోహిత్ కూడా తాగుతాడు. ఆ తర్వాత అందరు భోజనానికి వస్తారు.
భవిత హాల్లో భోజనానికి రాకుండా డల్ గా కూర్చొని ఉంటుంది. గీత వెళ్లి రమ్మని పిలుస్తుంది. నేను కొట్టానని ఫీల్ అవుతాన్నావ్ నా పెంపకంలో పెరిగిన పిల్లలు తప్పు చెయ్యొద్దుని అనుకుంటానని గీత చెప్తుంది. ఆ తర్వాత గీత డల్ గా ఉంటుంది. భాను వచ్చి ఏంటి గీత నువ్వు తప్పు అనే పదం కూడా రాకుండా ఉండాలి అనుకుంటావ్ .. పెళ్లికి ముందు ఏదైనా తప్పు జరిగిందా.. నీ విషయంలో అని భాను అడుగుతాడు. దాంతో గీత కవర్ చేస్తుంది. వాళ్ళ మాటలన్నీ అంజలి వింటుంది. రత్నం దగ్గరికి వెళ్లి అమ్మకి గతం గుర్తు వచ్చినట్లుందని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO Keywords:




.webp)
.webp)
