Home

»

Tv News

Ye Devi Varamo Neevu: రాకీ దగ్గర అంజలి ఫోటో చూసి షాక్ అయిన ముత్యాలరావు!

Oct 11, 2026 9:41AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -87 లో గీత కళ్లు తిరిగి పడిపోతుంది. అంజలి అది చూసి అందరిని పిలుస్తుంది. డాక్టర్ ని పిలుస్తారు. డాక్టర్ చెక్ చేసి పడిపోవడం వల్ల కాలు బెణికిందని చెప్తుంది. అమ్మ ఇలా ఉంటే మనకి ఎవరు వంట చేస్తారని బయటకు వెళ్లి భోజనం చేసి వద్దామని భవిత అనగానే అలా వెళ్తే అత్తయ్యని ఎవరు చూసుకుంటారని మనీష్ అంటాడు. అమ్మ పడుకుంది కదా అని భవిత అనగానే మీరు వెళ్లండి అత్తయ్యని నేను చూసుకుంటానని మనీష్ చెప్తాడు. 

భవిత వాళ్లంతా బయటకు వెళ్తారు.అంజలి లోపలికి వచ్చి గీతని చూసి బాధపడుతుంది. నువ్వేంటి అంజలి ఇలా వచ్చావ్ అత్తయ్య నిన్ను చూస్తే కోప్పడుతుందని మనీష్ అంటాడు. మరోవైపు రాకీ డ్రింక్ చేసే ప్లేస్ దగ్గరకు ముత్యాలరావు అంజలిని వెతుకుతూ వస్తాడు. రాకీని మస్కా కొట్టి డ్రింక్ చేయాలని అనుకుంటాడు. అతనితో మాటలు కలుపుతాడు. రాకీ ఫోన్ లో అంజలి ఫోటో చూస్తూ ముద్దు పెడతాడు. ఎవరని ముత్యాలరావు అడిగితే నా దేవత అని రాకీ చెప్తాడు. నా దేవత కోసం వెతికి నా కాళ్లు బొబ్బలు ఎక్కాయని అంజలి ఫోటో చూస్తూ ముత్యాలరావు అంటాడు. ఒకసారి నువ్వు చూపించమని ముత్యాలరావు అడగ్గా రాకీ అంజలి ఫోటో చూపిస్తాడు.

ఆ ఫోటో చూసి ముత్యాలరావు షాక్ అవుతాడు. నువ్వు వెతికే అమ్మాయి ఫోటో చూపించమని రాకీ అంటాడు. ముత్యాలరావు చూపించబోతుంటే అప్పుడే రాకీకి ఫోన్ వస్తుంది. ఇప్పుడు వీడికి నేను అంజలి గురించి వెతుకుతున్న విషయం తెలియొద్దని ముత్యాలరావు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాకీ వెళ్తుంటే అతన్ని ఫాలో అవుతాడు. అంజలి అడ్రెస్ కనుక్కోవాలని ఫాలో అవుతాడు కానీ రాకీ మిస్ అవుతాడు. మరోవైపు భవిత, రోహిత్ ఫోన్ చూస్తూ బిజీగా ఉంటారు. అంజలి మాత్రం గీత కాలికి మసాజ్ చేస్తూ బాగా చూసుకుంటుంది. అప్పుడే బాను వస్తాడు, అంజలి అలా సేవ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Ye Devi Varamo Neevu Today Episode 87, Ye Devi Varamo Neevu Serial, Star Maa Serial Today]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com