
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu.ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 52లో....అంజలిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని రాకీ ఆరాటపడతాడు. ఈ టెన్షన్ నా వల్ల కావట్లేదు.. ఈ రాత్రికే ఏదో ఒక ప్లాన్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే తన బావమరిది వచ్చి.. ఏంటి బావా సిగరెట్ కాలుస్తున్నావ్.. అమ్మ చూస్తే తిడుతుందని చెప్తాడు. దానికి రాకీ.. నేను ఎప్పుడైనా భయపడ్డానా.. అయినా నీకు చెప్పి వేస్ట్.. నువ్వు చిన్న పిల్లాడివి అని అంటాడు.ఆ తర్వాత అంజలిని భవిత పిలుస్తుంది. ఏంటీ ఇలా రెడీ అయ్యావ్.. నువ్వు పనిమనిషి అన్న విషయం మర్చిపోయావా.. ఇది మా ఇంట్లో జరుగుతున్న పూజ. నువ్వేదో ఈ ఇంటి బిడ్డలా రెడీ అయ్యావ్. వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అని చెప్పగానే అంజలి సరే అని వెళ్తుంది.
అంజలి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాక తన రూమ్ ని నీట్ గా సర్దమని చెప్తుంది. ఆ తర్వాత మనీష్ ని తీసుకొని వస్తుంది. రూమ్ చూడు బావా.. నీ కోసం ఎలా మార్చానోనని భవిత చెప్పగానే.. బాగుందని అంటాడు. అప్పుడే బాత్రూమ్ క్లీన్ చేసి అంజలి వస్తుంది. అంజలి నువ్వేంటి డ్రెస్ చేంజ్ చేశావని మనీష్ అడుగుతాడు. పనులు చేయాలి కదా అని భవిత అంటుంది. అంటే ఈ రూమ్ క్లీన్ చేసింది తనా అని మనీష్ అడిగితే అవునని భవిత చెబుతుంది. కావాలనే అంజలికి పనులు చెప్తుంది.ఆ తర్వాత అంజలికి భవిత టిప్ ఇస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు అని మనీష్ అంటుంటే అదేం లేదండీ, నేను సంతోషంగా తీసుకుంటున్నానని అంజలి తీసుకుంటుంది. ఆ తర్వాత గీత అందరికీ ప్రసాదం తినిపిస్తుంది.
గీత వదిలిపెట్టిన ప్రసాదాన్ని అంజలి తింటుంది. ఆ తర్వాత అంజలి దగ్గరకు రాకీ వచ్చి.. నిన్న నా మనసులో మాట చెప్పాను, నువ్వు ఇంకా చెప్పలేదని అడుగుతాడు. తరువాయి భాగంలో...
గీత అందరిని యోగా కోసం పిలుస్తుంది. భవిత రాకపోవడంతో గట్టిగా అరుస్తుంది. కానీ అంజలి వేసిన ముగ్గు దగ్గర కూర్చొని భవిత తనే ముగ్గు వేసినట్లు యాక్టింగ్ చేస్తుంది. అది అంజలి వేసిన ముగ్గు అని మనీష్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
