
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవీ వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 49 లో....గీత ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో పూజ చేస్తుంది. తులసి పూజ చేస్తుండగా అంజలి ఆమె వంక చూసి మురిసిపోతుంది. ఆ తర్వాత గీత అందరిని పిలుస్తుంది. దీంతో అంజలి పైకి వెళ్లి భవిత వాళ్లను నిద్ర లేపుతుంది. అమ్మో.. అమ్మ తిడుతుందంటూ అందరూ హడావిడిగా రెడీ అయి కిందకు వస్తారు.ఆ తర్వాత గీత వరలక్ష్మి వ్రతం ప్రారంభిస్తుంది. పిల్లలు మీరు మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని రత్నం చెప్పగానే భవిత వాళ్లు ఆశీర్వాదం తీసుకుంటారు. అందరు అక్కడి నుంచి వెళ్లిపోయాక గీత నిల్చున్న చోటుకు అంజలి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంది.
ఇంతలో మనీష్, రాకీ, ప్రీతి వాళ్లు లగేజ్ తో గీత ఇంటికి వస్తారు. వారిని గీత రిసీవ్ చేసుకుంటుంది. ఇదంతా అంజలి గమనిస్తుంది. మనీష్ తో గీత మాట్లాడదు. ఆమెను ఎలా మాట్లాడించాలా అని మేడం అంటూ మనీష్ పిలుస్తుంటే..ఎవడ్రా నీకు మేడం అంటూ మనీష్ చెవి మెలేస్తుంది గీత. దీంతో అందరు నవ్వుకుంటారు.
తరువాయి భాగంలో వ్రతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అమ్మమ్మా.. నేను అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని రత్నంకు అంజలి చెప్తుంది. దీంతో.. అందరూ కళ్లు మూసుకుని ఉండండి అని రత్నం చెప్పగానే.. గీత దగ్గరికి వెళ్లి అంజలి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ దృశ్యాన్ని మనీష్ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






