Home

»

Tv News

Ye Devi Varamo Neevu : నిజం బయటపడిన వేళ విషాదం.. రాజారావు కన్నుమూత!

Aug 19, 2026 9:40AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 38 లో.....రాజారావు తనని బ్లాక్మెయిల్ చేసిన అతని మాటలు గుర్తు చేసుకుంటాడు అప్పుడే రత్నం వస్తుంది. ఈ చెక్కు ఏంటండీ అంజలిని తీసుకొని వచ్చిన ఆశ్రమంకి మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారని అడుగుతుంది. నిజం చెప్పండి నా డౌట్ నిజమేనా గీతాంజలి కూతురు అంజలినే కదా అని రత్నం అడుగుతుంది. నా మీద ఒట్టేసి చెప్పండి అని రత్నం అనగానే అవునని రాజారావు చెప్తాడు. గీతాంజలి కూతురు అంజలి అని రాజారావు చెప్తాడు.

 

ఆ మాటలన్నీ అంజలి వింటుంది. షాక్ అవుతుంది. అసలు ఏం జరిగిందో రాజారావు అంతా రత్నంకి చెప్తాడు. రాజారావు ఇబ్బందిపడుతూ కింద పడిపోతాడు. తాతయ్య గారు అని అంజలి వస్తుంది. ఇక నుంచి ఆ బాధ్యత నీదే అని రత్నం చేతిలో అంజలి చెయ్ పెట్టి రాజారావు చనిపోతాడు. అందరూ వస్తారు. రాజారావుని చూసి షాక్ అవుతారు. భానుకి శంకర్ ఫోన్ చేసి నాన్న చనిపోయారని చెప్తాడు.

 

ఆ విషయం గీతకి భాను చెప్తాడు. గీత షాక్ అవుతుంది. వెంటనే అందరు రాజారావు ఇంటికి వెళ్తారు. తండ్రిని చూసి గీతాంజలి ఏడుస్తుంది. తరువాయి భాగంలో రాజారావు ఫోటోకి అంజలి పూలు పోస్తుంటే గీత అడ్డుపడి అసలు ఇదంతా నీ వల్లే, మా నాన్నకి నేనంటే బాగా ఇష్టం.. నీ వల్లే గొడవలు అయ్యాయని అంజలిని  మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com