Home

»

Tv News

Ye Devi Varamo Neevu : అంజలిపై రాకీ అసభ్య ప్రవర్తన.. వంటని మెచ్చుకున్న గీత!

Sep 5, 2026 10:06AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 56లో.. అంజలిని మనీష్ మార్కెట్ నుంచి తీసుకొస్తాడు. దారిలో అంజలి చెప్పు తెగిపోవడంతో నాకు ఇలాంటి చెప్పులే తీసుకురావాలని చెప్పి తన చెప్పులను మనీష్ కార్ డిక్కీలో వేస్తుంది. ఇంటికి వచ్చేసరికి హాల్లో రాకీ కూర్చుని ఉండటం చూసి అంజలి టెన్షన్ పడుతుంది. నాకు కాఫీ తీసుకురా అని రాకీ చెప్పడంతో అంజలి వెళ్లి కాఫీ పెడుతుంది.

 

కిచెన్ లోకి వచ్చి కాఫీ చాలా స్ట్రాంగ్ గా హాట్ గా ఉండాలని చెప్పి..  తర్వాత పైకి వెళ్లి నా రూమ్ కి తీసుకురా అంటాడు రాకీ. అంజలి రూమ్ కి కాఫీ తీసుకెళ్లగానే కావాలనే కింద పోసి క్లీన్ చేయమని చెప్పి, ఆమె క్లీన్ చేస్తుండగా భుజంపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తిస్తాడు రాకీ. డబ్బు చూపిస్తూ స్కూటీ కావాలా గోల్డ్ రింగ్ కావాలా అని అడుగుతాడు. మీ అన్నయ్య ఎలా ఉన్నాడు.. మీరెలా ఉన్నారు.. అసలు నువ్వు ఆయన తమ్ముడివేనా అని రాకీని అంజలి కోప్పడుతుంది. ఇక రాకీ మాట వినకపోవడంతో ఇప్పుడు చేయి తీయకపోతే మీ అన్నయ్యకు చెప్తానని వార్నింగ్ ఇస్తుంది. దాంతో రాకీ చేయి తీసి కోపంగా వెళ్లిపోమంటాడు.

 

ఆ తర్వాత అందరికి కావాల్సిన వంటలన్నీ అంజలే చేస్తుంది. భోజనం చేస్తూ వంటలన్నీ ఎంత రుచిగా ఉన్నాయి.. థాంక్స్ మమ్మీ ఇంత త్వరగా మంచి చెఫ్ ని ఏర్పాటు చేశావని కృతజ్ఞ అంటుంది. థాంక్స్ నాకు కాదు మీ డాడ్ కి.. తనే చెఫ్ ని ఏర్పాటు చేశాడని అంటుంది. ఇంతకీ చెఫ్ ఎక్కడ అని గీత అడగగానే భాను, మనీష్ టెన్షన్ పడతారు. తన వంటని అమ్మ మెచ్చుకుందని అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com