Jayam serial : డ్రింక్ చేసి వచ్చిన రుద్ర.. పారునే కారణం అని తెలుసుకున్న గంగ!
on Feb 14, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -192 లో.. ప్రసాదరావు దగ్గరికి రుద్ర వెళ్తాడు. ఎందుకలా అబద్ధం చెప్పారని అడిగినందుకు రుద్ర గురించి తప్పుగా మాట్లాడుతాడు. ఇక అక్కడే ఉన్న పారు.. ఇంకా రుద్ర బాధపడేలా మాట్లాడుతుంది. అతి మంచితనం పనికిరాదు రుద్ర.. ఇప్పుడు చూడు నువ్వు అందరి దృష్టిలో ఒక లూజర్ వి అని పారు అనగానే రుద్ర బాధపడతాడు. మరొకవైపు ఇంకా రుద్ర ఇంటికి రాలేదని అందరు ఎదురుచూస్తారు. చాలా సేపైనా రాకపోయేసరికి వీరు, సూర్య వెళ్ళడానికి రెడీ అవుతారు. అప్పుడే రుద్ర వస్తాడు.
రుద్ర డ్రింక్ చేసి తూలుతూ వస్తాడు. తనని చూసి అందరు షాక్ అవుతారు. పెద్దనాన్న మీ ముందు తలెత్తి మాట్లాడులేదు కానీ ఇలా మాట్లాడుతున్నానంటే నాలో ఎంత బాధ ఉందో అర్ధం చేసుకోండి.. పెద్దమ్మ నేను భాను చావుకి కారణం కాదని గట్టిగా అరవాలనిపిస్తుంది కానీ ఆధారాలు లేవు.. నువ్వు నన్ను ప్రేమగా రుద్ర అని పిలుస్తావేమోనని ఎదురుచూస్తున్నానని రుద్ర ఎమోషనల్ గా మాట్లాడుతాడు రుద్ర. నేను భాను కోసం చేసిన మంచి కూడా నిరూపించుకోవాల్సి వచ్చిందని రుద్ర చెప్తాడు. రుద్రని సూర్య లోపలికి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు ఇంట్లో జరిగింది మొత్తం పారుకు ఇషిక ఫోన్ చేసి చెప్తుంది. రుద్ర అలా తాగి ఇంటికి రావడానికి కారణం నేనే అని పారు జరిగింది చెప్తుంది. ఇద్దరు అలా ఫోన్ లో మాట్లాడుకోవడం గంగ వింటుంది. గంగని చూసి ఇషిక షాక్ అవుతుంది
రుద్ర సర్ కి ఆ పరిస్థితి రావడానికి కారణం పారు నా.. దాని సంగతి చెప్తాను.. వచ్చి నీ సంగతి చెప్తానని గంగ వెళ్తుంది. అప్పుడే సూర్య, వంశీ ఇద్దరు ఇషిక దగ్గరికి వస్తారు. పారు దగ్గరికి గంగ వెళ్ళింది. తనని చంపేస్తానని రుద్ర బావ బాధపడడానికి కారణం పారు అనుకొని తప్పుగా అర్థం చేసుకుందని ఇషిక చెప్పగానే.. వంశీ, సూర్య ఇద్దరు రుద్రని లేపడానికి ప్రయత్నం చేస్తారు. మరొకవైపు పార్టీలో ఉన్న పారు దగ్గరికి గంగ వెళ్లి తన చెంప చెల్లుమనిపిస్తుంది. మరోవైపు మత్తుగా పడుకున్న రుద్రని లేపడానికి వంశీ, సూర్య ప్రయత్నిస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



