Home

»

Tv News

Illu illalu pillalu : అమూల్యను ఏడిపించిన విశ్వ గ్యాంగ్.. చందుకి అసలు నిజం చెప్పేసిన వల్లి!

May 26, 2026 10:18AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -480 లో.....సాగర్ ఆఫీస్ కి రెడీ అవుతూ నర్మద బాక్స్ తీసుకొని రా అంటాడు. దాంతో నర్మద ఎంప్టీ బాక్స్ తీసుకొని వచ్చి రెడీ అంటుంది. ఏంటి జోక్ చేస్తున్నావా అని సాగర్ అంటాడు. ఫస్ట్ బాక్స్ తీసుకొని రా అని సాగర్ అంటాడు. జోక్ చేసింది ఎవరని నర్మద అంటుంది. నువ్వు అన్ని పిలవగానే తీసుకొని రావడానికి మనం కలిసి లేము సపరేట్ గా ఉన్నాం.. నువ్వు సరుకులు ఎక్కడ తీసుకొని వచ్చావని నర్మద అంటుంది. సరే సాయంత్రం తీసుకొని వస్తానని సాగర్ బయల్దేరతాడు. ఆ తర్వాత తిరుపతి పేపర్ చదువుతూ అత్తాకోడళ్ల గొడవలో భాగంగా ఇంట్లో నుంచి అత్త వెళ్ళిపోయిందని చదువుతాడు.

అప్పుడే సాగర్ వెళ్తుంటే ఇండైరెక్ట్ గా రామారాజు తనకి కౌంటర్ వేస్తాడు.  సాగర్ కూడా అలాగే మాట్లాడుతాడు. రామరాజు పైకి అలా మాట్లాడుతున్నా లోపల తనకి బాధ ఉంటుంది. ఆ తర్వాత అమూల్యకి బాక్స్ ఇచ్చి వేదవతి కాలేజీకి వెళ్ళమంటుంది. నేను వెళ్ళనని అమూల్య ఏడుస్తుంది. అసలు ఏం జరిగింది చెప్పమని నర్మద, ప్రేమ, ధీరజ్ అడుగుతారు. కాలేజీలో విశ్వ ఫ్రెండ్స్ అంతా కలిసి.. నువ్వు విశ్వతో ఉన్నావ్ కదా ఫస్ట్ నైట్ అయిందా అని ఏడిపించారని అమూల్య చెప్తుంది. వాడిని చంపేస్తానని ధీరజ్ అంటాడు. ఇప్పుడు అతన్ని ఏదైనా అంటే మనకే ప్రాబ్లమ్.. ఎందుకంటే అతను డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వలేదు.. తన ఫ్రెండ్స్ ద్వారా అలా చేసాడు.. ఇప్పుడు మనం రియాక్ట్ అయిన నేను నీ చెల్లిని ఏమైనా అన్నానా అంటాడని ధీరజ్ తో నర్మద అంటుంది. నాకు వాడికి ఎలా బుద్ది చెప్పాలో తెలుసని ధీరజ్ అంటాడు.

మరొకవైపు చందు తండ్రి కాబోతున్నాడని చిన్నపిల్లల ఫొటోస్, బొమ్మలు తీసుకొని వస్తాడు. అవన్నీ చూసి ఇవన్నీ ఎందుకని వల్లి అడుగుతుంది. నువ్వు కడుపుతో ఉన్నావ్ కదా ఇవన్నీ చూస్తే ప్రశాంతంగా ఉంటావని చందు అనగానే వల్లి బాధపడుతుంది. బా నేను ప్రెగ్నెంట్ కాదు మా వాళ్ళు ఇదంతా నన్ను ఇంట్లోకి రప్పించడానికి ప్లాన్ చేశారని వల్లి చెప్పగానే చందు షాక్ అవుతాడు. అప్పుడే సుకన్య వచ్చి చాలా బాగా యాక్టింగ్ చేసావ్ వల్లి.. ఇదంతా ఫ్రాంక్ చేసామని సుకన్య అంటుంది. ఏంటి వల్లి ఇలాంటి విషయంలో ఫ్రాంక్ చేస్తారా అని చందు కోప్పడతాడు. అక్కడ నుంచి చందు వెళ్ళిపోయాక ఎందుకు నిజం చెప్తున్నావ్.. నేను లేట్ గా వచ్చి ఉంటే పరిస్థితి ఏంటని సుకన్య అంటుంది. దాంతో వల్లి ఏడుస్తుంది. పుట్టబోయే బిడ్డపై చందు ఆశలు పెంచుకుంటున్నాడని ఏడుస్తుంది వల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com