Home

»

Tv News

సుధీర్‌కి రజనీకాంత్ కనిపించడం లేదు ..మైండ్ పోయింది!

Apr 14, 2026

ఆట షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమో చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే. "మరి ఫినాలేకి గెస్టులు ఎవరొస్తున్నారు " అంటూ సుధీర్ నిహారికను  అడిగాడు. అంటే  "ఫినాలే వరకు ఎందుకు సుధీర్ ఈరోజే వస్తున్నారు " అంది. "ఎవరొస్తున్నారు ఇంతకు  " అన్నాడు ఆత్రంగా. "రజనీకాంత్ గారు " అంటూ నిహారికా అరుస్తూ చెప్పింది. ఇక ఆడియన్స్ లో ఉన్న వాళ్లంతా పూలు జల్లి అంతా హడావిడీ చేశారు. సెట్ మీద తలైవా ఫోటో కూడా పెట్టారు. నిహారికా వెంటనే అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టు హడావిడి చేస్తూ  "ఇతనే సుధీర్ " అంటూ పరిచయం చేసింది. ఐతే అక్కడ ఎవరూ లేరు. సుధీర్ మాత్రం ఎవరున్నారు అక్కడా అంటూ తెగ  తొంగి తోంది చూసేసాడు. కానీ తనకు ఎవరూ కనిపించలేదు. "హాయ్ " చెప్పు సుధీర్ అనేసరికి "నిజంగా ఇక్కడ ఉన్నారా " అన్నాడు సుధీర్.

"సర్ ఒక్క ఫోటో దిగుదాం సర్ " అంది నిహారిక. "చూడు రాధికా గారిని చూడగానే రజనీకాంత్ గారు ఎలా మెలికలు తిరుగుతున్నారో " అంది నిహారిక. "నాకు మనిషే కనిపించడం లేదు మీకు మెలికలు తిరగడం కూడా కనబడుతోందా" అన్నాడు సుధీర్. ఇక ఆడియన్స్ కూడా తలైవా తలైవా అంటూ అరిచారు. చంటి వచ్చి పూలదండను తెచ్చి రజనీకాంత్ మేడలో వేయడం చూసాడు సుధీర్. "ఓహ్ అందరికీ కనబడుతున్నారా...నా ఒక్కడికే కనపడ్డం లేదా. నిజంగానే మైండ్ పోయిందా ఏంటి నాకు" అనుకుని అలా చూసేసరికి రాధికా పడీపడీ నవ్వుతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com