Home

»

Tv News

మెహబూబ్‌కి పెళ్ళైపోతుంది... నాతో కాదు... నచ్చితే కొరియా అబ్బాయిని పెళ్లిచేసుకుంటా.!

Oct 11, 2026 12:44PM

సోషల్ మీడియాలో శ్రీసత్య, మెహబూబ్ ఇద్దరూ కలిసి ఎన్నో కవర్ సాంగ్స్ చేశారు. " నువ్వే కావాలి " సాంగ్ కూడా బాగా వైరల్ అయ్యింది. ఈ సాంగ్ తర్వాత వీళ్ళ మీద చాలా గాసిప్స్ ఐతే వచ్చాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాల గురించి చెప్పింది శ్రీ సత్య.

"మీకు మెహబూబ్ కి సంథింగ్ సంథింగ్ అంటున్నారు.. ఆ గాసిప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి " అని ప్రశ్నకు శ్రీసత్య ఇలా చెప్పింది. "మెహబూబ్ ని అడగండి అమ్మో సత్యనా బాబోయ్ అంటాడు. మెహబాబ్ చాలా మంచి ఫ్రెండ్. ఇద్దరం కలిసి బిబి జోడి చేసాం. వెంటనే ఒక సాంగ్ మళ్ళీ ఇంకో సాంగ్ చేసాం. నిజానికి "నువ్వే కావాలి " సాంగ్ కి నేను కాదు చేయాల్సింది. వేరే అమ్మాయి దొరకలేదు అని నన్ను పెట్టుకున్నాడు. నేనే ఒక పది ప్రొఫైల్స్ పంపించా ఈ అమ్మాయిని పెట్టుకో ఆ అమ్మాయిని పెట్టుకో అని. కానీ లాస్ట్ కి ఎవరూ సెట్ అవ్వట్లేదు అని చెప్పి చేసాడు. ఒక అబ్బాయి అమ్మాయి నార్మల్ గ మాట్లాడుకున్నా రెండు ప్రాజెక్ట్స్ కలిపి చేసినా ఇదొక టాగ్ వచ్చేస్తుంది. కానీ నమ్మండి మెహబూబ్ కి పెళ్ళైపోతుంది. నేను కాదు పెళ్లి కూతురు మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. మేము గుడ్ ఫ్రెండ్స్ .

నేను  మెహబూబ్ తో ఆ సాంగ్ చేసాక పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి మంచి అపీప్రిసియేషన్స్ వచ్చాయి. ఆ సాంగ్ కి నాలుగురుమే షూటింగ్ లొకేషన్ కి వెళ్ళాము. అందరం 90 స్ కిడ్స్. కానీ ఆ సాంగ్ నాకు ఇంకా ప్రాజెక్ట్స్ రావడానికి చాలా హెల్ప్ అయ్యింది. త్వరలో కొరియా వెళ్తున్నా కదా పది రోజుల్లో ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకుంటా పక్కా"  అని చెప్పింది శ్రీసత్య.

 

 

[Srisatya Mehboob relationship rumors, Srisatya Nuvve Kavali song, Srisatya Mehboob dating gossip, Srisatya latest interview, Srisatya marriage comments]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com