.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో కొంచెం ఎమోషనల్ గా కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉన్నట్టు కనిపించింది. ఈ ఎపిసోడ్ లో యూనివర్సల్ మామ్ గా ఉన్న అలనాటి అందాల సహజ నటి జయసుధ వచ్చింది. అలాగే ఓల్డ్ ఏజ్ నుంచి కొంతమంది తల్లులు కూడా వచ్చారు. రాగానే రాంప్రసాద్ "ఇండస్ట్రీలో చాలా చాలా పెద్ద పెద్ద హీరోలకు మదర్ గా చేశారు కదా ఒక వేళా ఫ్యూచర్ లో నేను హీరో ఐతే నాకు మదర్ గా చేస్తారా " అని అడిగాడు.
దానికి జయసుధ ఎం మాట్లాడలేదు. "ఏంట్రా మదర్ గా చేయడానికి ఆలోచిస్తున్నారా " అని నరేష్ ని అడిగాడు. "నువ్వు హీరోగా చేస్తున్నావంటే ఆలోచిస్తున్నారు " అంటూ కౌంటర్ ఇచ్చాడు. "ఇక్కడ కొంతమంది మదర్స్ తల్లులు లేకుండా అక్కడ కొంతమంది బాధపడుతున్నారు. మనందరం కలిసి ఈ మదర్స్ డేని సెలెబ్రేట్ చేసుకోవాలి " అని చెప్పింది జయసుధ. ఒక తల్లి తనకు కొడుకు ఉంటే అతని బండి మీద వెళ్లాలని కోరుకునేసరికి రాంప్రసాద్ తన బైక్ మీద డ్రైవింగ్ కి తీసుకెళ్లాడు.
ఇక పండు వాళ్ళ అమ్మ తనకు అమెరికా వెళ్లాలనే కోరిక ఉందని చెప్పేసరికి పండు షాకయ్యాడు. ఇంకో తల్లి ఐతే తనకు మామిడిపండు కావాలని అది కూడా చెట్టెక్కి తేవాలని ఆ చిటారు కొమ్మన ఉన్న కాయని తెంపాలని నాటీ నరేష్ ని అడిగింది. తర్వాత అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీలో ఒక సీన్ ని స్పూఫ్ గా చేశారు నరేష్, సన్నీ, బాబు వీళ్లంతా. ఫైనల్ లో రాకెట్ రాఘవ వచ్చి "చూస్తుండగానే మనిషి కాలిపోయింది. మనమే చేయలేము. బెడ్ మీద కాలిపోయి ఉంది. దగ్గరకు వెళ్లాను. అన్నం తిను అంది. దయచేసి ఉన్నోళ్లను జాగ్రత్తగా చూసుకోండయ్యా. అలా ఓల్డేజ్ హోముల్లో వదిలేయకండి" అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు.





