Home

»

Tv News

ఎగిరిపోదామన్న మొనగాడా ఎక్కడా ? పరివారం బ్యాంకు నుంచి బాక్స్ కూడా...

Oct 11, 2026 12:20PM

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అందులో ఒక కాన్సెప్ట్ ఇచ్చింది శ్రీముఖి. బొమ్మ చూసి కథేంటో చెప్పాలి. అందులో ఒక పిక్ ని బాలుకి చూపించింది శ్రీముఖి. "అనగనగ ఒక ఊరిలో బాలు అనే అబ్బాయి ఉన్నాడు. అతను హైదరాబాద్ కి ట్రైన్ లో వచ్చాడు. ఇక్కడ సీరియల్ లో చేస్తూ ఉండగా మంచి నేమ్, ఫేమ్ వచ్చింది.

అప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో పిలిచారు. సీరియల్ లో ఎలా ఫేమస్ అయ్యానో అలాగే శ్రీముఖి గారి వలన ఈ షోలో కూడా ఫేమస్ అయ్యాను. శ్రీముఖి గారు వచ్చి నాతో మాట్లాడినప్పుడల్లా పక్కనే అవినాష్ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అందుకే అవినాష్ నుంచి తప్పించుకోవడానికి శ్రీముఖి ప్రైవసీ కోసం చెన్నై తీసుకెళ్లమంటే అలా వెళ్లాం " అని ఒక స్టోరీ చెప్పాడు బాలు. వెంటనే శ్రీముఖి "మీరు ఒక గమనించారా ఖర్చుల కోసం మనం పరివారం బ్యాంకు నుంచి సూట్కేస్ కూడా తీసుకెళ్లాం " అని చెప్పింది. "ఒక లవ్ స్టోరీ స్టాండ్ అవ్వాలంటే అది బస్సు స్టాండ్ అవ్వాలనుకున్నాం కానీ అప్పుడు బస్సులు స్ట్రైక్ అని తెలిసి ఎలాగైనా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలి అనుకున్నాం. దిల్వాలే దుల్హనియె లేజాయేంగే మూవీ గుర్తొచ్చింది వెంటనే రైల్వే స్టేషన్ కి వెళ్లాం ఆల్రెడీ ట్రైన్ స్టార్ట్ ఐపోయింది. ఆ రన్నింగ్ ట్రైన్ లో అలా మనం వెళ్లాం . ఇక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి వచ్చిన టైటిల్ "ఎగిరిపోదామన్న మొనగాడా ఎక్కడా " అంటూ శ్రీముఖి బాలు కథకు కంటిన్యుయేషన్ చెప్పింది.

ఇక ఈ షోలో ఉన్న అందరికీ మల్లెపూలు, కనకాంబరాలు దండ అల్లే టాస్క్ ఇచ్చింది. ఐతే ఎవరూ ఇందులో సరిగా పార్టిసిపేట్ చెయ్యలేదు. ఒక్క సుహాసిని మాత్రమే మల్లెపూలతో ఒక గుత్తుగా ఒక దండను గుచ్చింది. ఆ దండను తీసుకుని శ్రీముఖి ఆమె తలలో తురుముకుంది.

 

 

[Sreemukhi and Balu funny skit Star Maa Parivaaram, Adivaram With Star Maa Parivaaram highlights, Sreemukhi Balu love story comedy track, Star Maa Parivaaram flower garland task comedy, Sreemukhi and Avinash funny moments, Adivaram With Star Maa Parivaaram funny episodes]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com