నెలతప్పిన సోనియా...ఆనందంతో హగ్ చేసుకున్న యష్
on Jul 19, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్ 8 బోల్డ్ కంటెస్టెంట్ సోనియా ఆకుల గురించి తెలియని తెలుగు ఆడియన్స్ లేరు. భర్త యష్ వీరగోనితో కలిసి ఇస్మార్ట్ జోడికి కూడా వెళ్ళింది. ఇక రీసెంట్ గా ఒక విషయాన్ని షేర్ చేసుకుంది. ఒక కాన్ఫిడెన్షియల్ ఫైల్ పట్టుకుని భర్త దగ్గరకు వెళ్ళింది. ఇక యష్ ఆ ఫైల్ లో మ్యాటర్ చూసి ఫుల్ ఫిదా ఐపోయి హగ్ చేసుకున్నాడు. ఇక సోనియా ఐతే ప్రెగ్నెన్సీ రివీల్, న్యూ ఎడిషన్స్, పేరెంట్స్ టోబ్, న్యూ బేబీ, మమ్మీ టోబ్ వంటి హాష్ ట్యాగ్స్ పెట్టింది. ఇక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి, కిర్రాక్ సీత, వాసంతి కృష్ణన్ వంటి వాళ్లంతా కంగ్రాట్యులేషన్స్ చెప్పారు.
అలాగే నెటిజన్స్ కూడా విషెస్ చెప్పారు. "మా జీవితంలో ఒక లిటిల్ మిరాకిల్ జరగబోతోంది..చాలా సంతోషంగా ఉన్నాం" అని కోట్ పెట్టింది సోనియా. ఇక ఆ ప్రాజెక్ట్ రెండు పేపర్స్ లో కొన్ని విషయాలను మెన్షన్ చేసింది. బేబీ ఆన్-బోర్డింగ్ డిసెంబర్ అని , టూర్స్, ట్రావెల్ ప్లాన్స్, షూట్స్ అన్నీ పోస్ట్ పోన్డ్ అని, మీడియా అండ్ కవరేజ్ లో భాగంగా ఇన్స్టా లో రెడీ అని అంటూ చెప్పింది. అలాగే తాతయ్య, నానమ్మ, అన్నయ్య, వదిన, మామ, బావా వాళ్ళ వాళ్ళ బ్రీఫ్ డిస్క్రిప్షన్ కూడా అందులో రాసింది. "మా బేబీ చూడడానికి వెయిట్ చేయలేకపోతున్నాం" అంటూ ఇలాంటి ఒక ఎక్సయిటింగ్ న్యూస్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ మూవీ కరోనా వైరస్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే సోనియా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మీద హాట్ కామెంట్స్ చేసింది. ఇక తాను బిగ్ బాస్ కి రాను అని చెప్పేసింది. ఇక యష్ ఐతే ఫ్లైహై టూరిజమ్ సంస్థతో పాటు విరాట్ ఫౌండేషన్ అనే సంస్థను కూడా నడుపుతున్నాడు. అమెరికాలో దావత్ పేరుతో రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక సోనియా వీళ్ళ ప్రేమ, పెళ్లి గురించి బిగ్ బాస్ లో రివీల్ చేసిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



