Home

»

Tv News

Bigg Boss 10 Telugu Rohith : మేలుకో రాజా మేలుకో.. రోహిత్ కి నాగార్జున మాస్ వార్నింగ్!

Oct 11, 2026 12:59PM

బిగ్ బాస్ సీజన్-10 లో రోహిత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికి తెలుసు. అయితే తన గేమ్ షాలినీ, అపూర్వ వల్ల డిస్టబ్ అవుతుంది. ఇక ఈ పాయింట్ మీద నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున చాలా స్మూత్ గా చెప్పాడు. 

ఈ వీక్ నీ ఆటతీరుకి ఎన్ని మార్కులు ఇస్తావ్ రోహిత్ అని నాగార్జున అడుగగా అదేంటి ఒక్క గేమ్ కూడా గెలవకుండా ఎలా ఇచ్చుకుంటావ్.. పోనీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చావా లేదు.. హౌస్ లో వాష్ రూమ్ క్లీన్ గా చేశావా లేదు.. ఎప్పుడు చూసిన షాలినీతో కలిసి అర్థరాత్రి వరకు ముచ్చట్లు అంటూ క్లాస్ పీకాడు నాగార్జున. బాగుంది. కానీ మాత్రం మైనస్ అని నాగార్జున క్లాస్ పీకాడు.

ఫస్ట్ వీక్ టాప్ లో ఉన్న నువ్వు.. సెకండ్ వీక్ నుంచి డౌన్ అవుతూ వస్తున్నావ్.. అగ్నిపరీక్ష బ్యాచ్ గా గ్రూప్ గా ఆడుతూ, అసలు గేమ్ మరిచిపోయావ్.. ఎవరి పక్కన ఉండటం వల్ల ఇలా అయిపోయావో చూస్కోమని నాగార్జున అన్నాడు. అమన్, అపూర్వ, షాలిని అందరిని వెనకేసుకొచ్చి, కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా బయాస్డ్ గా ఉన్నావని అన్నాడు. ఇక నుండి అయినా మేలుకో రాజా మేలుకో అంటూ రోహిత్ కి నాగార్జున చెప్పాడు. నువ్వు ఇలానే గ్రూప్ గేమ్ ఆడితే జనాలు నిన్ను చూడరు.. నీ ఇండివిడ్యువల్ గేమ్ చూపించు అని చెప్పాడు. హౌస్ లో అందరికన్నా ఎక్కువ తెలివైనోడు నువ్వే అనుకుంటున్నావ్, కానీ ఆ తెలివి గేమ్ లో చూపించు, గ్రూప్ రాజకీయాల్లో కాదు అని స్ట్రాంగ్ గా చెప్పాడు. దీంతో రోహిత్ సైలెంట్ అయిపోయాడు. సారీ సర్, ఇక నుంచి ఇండివిడ్యువల్ గేమ్ ఆడతా అని చెప్పాడు.

 

 

[Rohith ki warning ichina Nagarjuna, Bigg Boss 10 Telugu Rohith warning, Nagarjuna mass warning to Rohith, Rohith group game Bigg Boss]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com