
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -282 లో.....ఇషికని వీరు కలుస్తాడు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి.. పైడిరాజు, లక్ష్మీల సొంతకూతురు గంగ కాదని వీరు చెప్తాడు. ఆ విషయం తెలిస్తే మనకి వచ్చి లాభం ఏంటని ఇషిక అంటుంది. సుధా అమ్మకి కూతురు ఉంటే ఖచ్చితంగా మా మావయ్య ఈ ఇంటికి కోడలు చేసుకునేవారు.. కానీ అనుకోకుండా మేనకోడలిని ఈ ఇంటికి కోడలుగా చేసుకున్నాడు మావయ్య అని గంగ గురించి వీరు అంటాడు..
ఏం అంటున్నావ్ బ్రో.. నాకేం అర్థం కావడం లేదని ఇషిక అనగానే సుధా అమ్మ వాళ్ళ కూతురు చిన్నప్పుడు తప్పిపోయింది అన్నారు కదా.. తను ఎవరో కాదు మన గంగనే.. వాళ్ళ సొంత కూతురు గంగ అని వీరు చెప్పగానే ఇషిక షాక్ అవుతుంది. వాళ్ళకి ఈ విషయం తెలుసా అని ఇషిక అడుగుతుంది. లేదని వీరు చెప్తాడు. మరొకవైపు గంగ, ఇందుమతి గుడికి వెళ్లి నడుచుకుంటూ వస్తారు. అప్పుడే అటుగా వస్తున్న రఘునాథ్ కిందపడిపోతాడు. వెంటనే గంగ వెళ్లి వాటర్ ఇచ్చి హెల్ప్ చేస్తుంది. గంగని చూసి అతను షాక్ అవుతాడు. అప్పుడే అటుగా వెళ్తున్న విశ్వ... రఘునాథ్ ని చూసి కార్ ఆపి దగ్గరికి వెళ్తాడు. ఏమైందని విశ్వ అడుగుతాడు. గంగ, విశ్వ మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి మీకు తెలుసా అని అతను అనగానే మేం బంధువులమని గంగ అంటుంది. కన్నకూతురిని పక్కన పెట్టుకొని వెతుకుతున్నావా అని రఘునాథ్ మనసులో అనుకుంటాడు. ఇంతకి నేను చెప్పింది.. ఏం చేసావని విశ్వ అతన్ని అడుగుతాడు. అది అవ్వడం లేదని రఘునాథ్ అబద్ధం చెప్తాడు. మరి ఎందుకు ఒప్పుకున్నట్లు అని విశ్వ అతనిపై కోప్పడి వెళ్తాడు. అతను అంతే బాబాయ్ గారు అని గంగ అంటుంది. నీకు అంతా మంచే జరుగుతుంది అమ్మా అని గంగతో అతను అంటాడు.
ఆ తర్వాత పెద్దసారు, ప్రీతీ హాల్లో కూర్చొని ఉండగా రుద్ర వచ్చి ట్యాబ్లెట్ వేసుకున్నావా అని ప్రీతీని అడుగుతాడు. అన్నయ్య అంటే నీలాగా ఉండాలని పెద్దసారు అంటాడు. అప్పుడే శకుంతల వస్తుంది. ఇంతమంది ఉన్నారు.. ప్రీతీ శ్రీమంతం గురించి ఆలోచించడం లేదని కోప్పడుతుంది. మేము దగ్గరుండి ఏర్పాట్లు చేస్తానని వీరు, సూర్య అంటారు. నాకు అవసరం లేదు.. నేను ఇప్పుడే చేసుకోను.. గంగ వదిన బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాక చేసుకుంటాను.. నా శ్రీమంతం గంగ వదిన రుద్ర అన్నయ్య వాళ్ళ చేతుల మీదుగా జరగాలని ప్రీతీ అనగానే రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






