Home

»

Tv News

అఖండ ధుని సాక్షగా ప్రియాంక జైన్ - శివ్ పెళ్లి

Mar 16, 2026

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ రియాలిటీ షో రీసెంట్ గా స్టార్ మాలో స్టార్ అయ్యింది. పది జంటలు ఒక లవ్లీ మాన్షన్ లో ఇది స్టార్ట్ అయ్యింది. ముందుగా వచ్చిన కపుల్ ప్రియాంక జైన్ - శివ్ .వీళ్ళను రాధ ఒక విషయం అడిగింది. ఈరోజు మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చెప్పాలి అంది. అంతే అసలు విషయం చెప్పారు. మా  పెళ్లి త్వరలో జరగబోతోంది అంటూ  మాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ప్రియాంక రివీల్ చేశారు. ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. డెస్టినేషన్ అనేది ఉత్తరాఖండ్ లోని త్రియుగీ నారాయణ్ టెంపుల్ లో అఖండ ధుని సాక్షిగా చేసుకోవాలని ప్లాన్ చేసాం. ఈ టెంపుల్ లోనేఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం అంటే శివ పార్వతులు ఇక్కడ వివాహం చేసుకున్నారు.

అలాంటి ప్రదేశంలో ఈ శివ్ - పరి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ అఖండ ధుని మూడు యుగాలుగా అలా  మండుతూనే ఉంది, అందుకే దీనిని 'అఖండ ధుని ఆలయం' అని కూడా  పిలుస్తారు. ఇక శ్రీముఖి వాళ్ళను విష్ చేసింది. తర్వాత వాళ్ళ ప్రేమలో ఎంత మ్యాడ్నెస్ ఉందో టెస్ట్ చేసింది.  అందులో ప్రియాంక పాస్ అయ్యింది. తర్వాత హ్యాండ్ కాస్టింగ్ పేరుతో వాళ్ళ చేతులతో ఉన్న ఒక చిత్రాన్ని చేసి ఇచ్చింది. అందులో శ్రీముఖి వాళ్లకు నచ్చిన కొటేషన్ ని రాయించింది. "ఆమె ప్రేమించే దాని కంటే నేనే ఎక్కువ ప్రేమిస్తాను " అంటూ శివ్ రాసాడు. ఐతే ప్రియాంక మాత్రం  శివ్ కంటే నేనే ఎక్కువగా ప్రేమిస్తాను  అనేది రుజువు చేసి చూపిస్తాను అని చెప్పింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com