
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 194 లో.. బస్టాండ్‌లో సత్య, గోపిక తననే చూస్తున్నారని కన్నా భ్రమపడతాడు. కానీ సత్య వచ్చి అసలు విషయం చెప్తుంది. గోపికకు కేశవ నచ్చాడని, రౌడీని కొడుతుంటే చూసి ఇష్టపడిందని, అన్నయ్య నంబర్ ఇమ్మని అడగడంతో కన్నా డిస్సాప్పాయింట్ అవుతాడు. ఈ విషయాన్ని బాధతో చక్రికి చెప్పుకుంటాడు.
చక్రి, కన్నా ఈ విషయం కేశవకు చెప్పడానికి వెళ్తారు. కన్నా వద్దంటున్నా చక్రి అక్కడే ఉన్న శైలు ముందే విషయం బయటపెడతాడు. దీంతో శైలు కోపంలో కేశవ కాలర్ పట్టుకుని.. నేను బోర్ కొట్టేశానా అని నిలదీస్తుంది. కేశవకు ఏమీ తెలియదని చక్రి సర్దిచెప్పినా వినకుండా కన్నా, చక్రిలను కూడా తిడుతుంది.
మరోవైపు మాధవ (పెద్ది) కుటుంబానికి తెలియకుండా మ్యారేజ్ బ్రోకర్‌ను పిలిపించి రెండో పెళ్లి అయిన ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్తాడు. తండ్రి నారాయణ ప్రశ్నించగా తెలివిగా కవర్ చేస్తాడు. ఈ సంబంధం గురించి ఎవరికీ చెప్పవద్దని బ్రోకర్‌ను బెదిరిస్తాడు. ఆ తర్వాత మహా బ్రోకర్‌ను చూసి పెద్దికి మంచి సంబంధం చూడమని చెప్తుంది. బ్రోకర్ నిజం చెప్పమని సలహా ఇచ్చినా మాధవ వినడు. చివరకు శైలు, కన్నా బస్టాండ్ దగ్గర వేచి ఉండగా కేశవ కూడా అక్కడికి వస్తాడు. గోపిక, సత్య రాగానే శైలు.. నా కన్నయ్యపై కన్నేశావా అని గొడవకు దిగుతుంది. కేశవ ముందుకు రాగానే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. మేము అడిగింది ఈయన గురించి కాదు..ఉదయం వచ్చిన వేరే వ్యక్తి గురించి అని ఆ అమ్మాయిలు చెప్పడంతో కన్నా, కేశవ, శైలు ముగ్గురు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






