Home

»

Tv News

Podharillu:రాఖీ పండుగ వేళ ఆది-మహా  ఎమోషనల్.. డబ్బుతో అవమానించిన అన్న, సిగ్గుగా ఉందన్న చెల్లిll

Sep 2, 2026 4:20PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-198 లో నారాయణకు గాయత్రి రాఖీ కడుతుంది. ఇదే నీ పుట్టిల్లు అనుకోమ్మా ఏ సమస్య వచ్చినా చెప్పమని నారాయణ భరోసా ఇస్తాడు. ఆ తర్వాత చక్రి మహాను బయటకు తీసుకెళ్తాడు. పెద్ద సర్ ప్రైజ్ కంటే ముందు చిన్న సర్ ప్రైజ్ ఉందంటూ సస్పెన్స్ పెడతాడు. దారిలో మహా మళ్లీ తాయారు టాపిక్ తీసి మీ అత్తలానే నీకు కూడా బుద్ధి లేదంటుంది. దానికి చక్రి రెండు వైపులా ప్రేమ ఉంటేనే అవుతుందని మాట్లాడి మా అత్త గురించే అంటున్నా అని కవర్ చేస్తాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూనే చక్రి నేరుగా మహాను విక్కీ క్యాబిన్ లోకి తీసుకెళ్లి బామ్మర్ది బాస్ అంటూ మహాలక్ష్మికి రాఖీ కడితే వెళ్లిపోతామని అంటాడు. దీంతో విక్కీ, లక్కీ షాక్ అవుతారు, మీలాంటి బాస్ అందరికీ ఉండాలని ఒక్కరోజు రాకపోతే ఇంటికొచ్చి యోగక్షేమాలు అడిగారని చక్రి పొగుడుతూ లంబో జంబో, బంటీ బబ్లు, రామ్ లక్ష్మణ్ లా విక్కీ లక్కీ పేర్లు కలిశాయని కామెడీ చేస్తాడు.అయితే మహా మనసులో మాత్రం వేరే ఆలోచన నడుస్తుంది. తను విక్కీతో క్లోజ్ గా ఉండటం చక్రికి నచ్చలేదేమో జెలసీతో ఉన్నాడేమో వీడిని ఆడించడానికి మంచి టాపిక్ దొరికిందనుకుంటుంది. అందుకే కావాలనే నేను విక్కీకి రాఖీ కట్టనని తెగేసి చెప్తుంది. దానికి చక్రి కంగారు పడితే మహా లోలోపల నవ్వుకుంటుంది. 

విక్కీ కూడా నేను కట్టించుకోను ఆల్రెడీ కట్టాల్సిన వాళ్లు కట్టేశారని అనడంతో మహా మరింత నవ్వుతుంది. చక్రి షాక్ అవుతాడు. పైగా విక్కీ నువ్వే కజిన్ కదా నువ్వే కట్టించుకో అని చక్రితో అంటాడు. దీంతో సారీ విక్కీ నాకు తెలీదు ఇందుకోసం తీసుకొచ్చాడని చెప్పి మహా వెళ్లిపోతుంది. చక్రి రాఖీ, చాక్లెట్ అక్కడే వదిలేసి బయటకు వస్తాడు. బయట మహా మీకు పిచ్చా నేను విక్కీకి రాఖీ కడతానని ఎలా అనుకున్నారని చక్రిని కావాలనే రెచ్చగొడుతుంది. ఇంతలో హారిక నుంచి ఫోన్ రావడంతో ఇది వేరే పెద్ద సర్ ప్రైజ్ అంటూ మళ్లీ తీసుకెళ్తాడు. అటు విక్కీ మాత్రం అమ్మో రాఖీ కడుతుందేమోనని భయపడ్డా నో చెప్పిందంటే తనకు ఫీలింగ్ ఉన్నట్టే కదా అని సంబరపడతాడు.

వీళ్ల ప్లాన్ ప్రకారం రెస్టారెంట్ లో ఆది, హారిక కూర్చుని ఉంటారు. ఏం తీసుకుంటావని ఆది అడిగితే మాట అని హారిక అంటుంది. ఇక్కడ ఏం జరిగినా కోప్పడొద్దని మాట తీసుకుంటుంది. అప్పుడే చక్రి, మహా అక్కడికి వస్తారు. ఒకరినొకరు చూసుకుని ఇది ఇక్కడికి ఎందుకు వచ్చిందని ఆది అంటే.. వీడు ఇక్కడ ఉన్నాడని ఎందుకు చెప్పలేదని మహా అంటుంది. మీ చెల్లి ఇక రాఖీ కట్టదని బాధపడుతున్నారని హారిక అంటే ఆ విషయం చెప్పి అడుక్కుని పిలిచావా అని ఆది అంటాడు. దానికి హారిక లేదు మీరు ఇచ్చిన చైన్ తెగిందని మహా బాధపడుతూ రాఖీ కట్టలేనేమోనని ఏడుస్తోందట అందుకే చక్రి ఇలా ప్లాన్ చేశాడని చెప్తుంది. రక్త సంబంధం తెంచుకుంటే తెగిపోదని మీ అన్నాచెల్లెళ్లు ఇన్నేళ్లలో రాఖీ పండుగను ఎప్పుడూ మిస్ చేసుకోలేదని ఇప్పుడూ మిస్ అవ్వొద్దని పండుగల టైంలోనే అందరూ కలిసిపోతారని హారిక, చక్రి నచ్చజెప్తారు. దానికి ఇద్దరూ వీడికే ఎక్కువ పొగరు, దానికే ఎక్కువ పొగరు అంటూ మళ్లీ మాటల యుద్ధం చేస్తారు. ఇద్దరూ ఒకే తల్లి కడుపు నుంచి వచ్చారు కదా పొగరు సమానంగానే ఉంటుందని హారిక అనడంతో చక్రి, హారిక పక్కకు వెళ్లి హారతి పళ్లెం రెడీ చేస్తారు.

చివరకు గొడవలు పక్కన పెట్టి రాఖీ కట్టమని హారిక చెప్పగా అది కట్టదా నేనే అడుక్కోవాలా అని ఆది అంటుండగానే మహా ముందుకొచ్చి ఆది చేతికి రాఖీ కడుతుంది. ఆ సమయంలో మహా కన్నీళ్లు ఆది చేతిపై పడతాయి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్ ఎవరైనా తిట్టారా అని ఆది అంటే నా ఏడుపు ఎందుకో మీకు అర్థమైతే నాకీ పరిస్థితి ఎందుకు వస్తుందని మహా అంటుంది. ఆ మాటలకు ఆది కూడా కన్నీరు పెట్టుకుంటాడు. నీకు ఎందుకు కన్నీరొచ్చిందని మహా అడిగితే నువ్వు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్తావని ఆది బాధపడతాడు. ఆ ఎమోషనల్ మూమెంట్ తర్వాత ఆది మళ్లీ రాఖీ కట్టి ఏమీ ఇవ్వలేదంటావ్.. ఈ డబ్బులు తీసుకో అనడంతో నా పేరు తాయారు కాదని మహా అంటుంది. తాయారు ఎవరని హారిక అడిగితే మా అత్త అని చక్రి చెప్పి నవ్విస్తాడు. నేను డబ్బుల కోసం రాలేదు అక్షింతలు వేసి ఆశీర్వదించమని మహా అంటే నోరేసుకుని పడిపోకుండా నోటిని అదుపులో పెట్టుకోమని ఆది అంటాడు. మీరు కూడా కిడ్నాప్‌లు హత్యలు మానేసి మంచి మనుషుల్లా బతకండని మహా కౌంటర్ ఇస్తుంది. ఆది మాట తూలి ఈ డబ్బులు తీసుకో మీ ఇంట్లో నెలకి సరుకులకు సరిపోతాయి అనడంతో మహా పూర్తిగా రెచ్చిపోయి ఏం అన్నావురా నీలాంటి కుక్కలు ఎంతమంది వచ్చినా అక్కడ అన్నానికి లోటు ఉండదు.. నీలాంటి వాడు మారుతాడని.. నీలాంటి వాడు నా అన్న అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉందని మహా తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com