Home

»

Tv News

Podharillu: కుటుంబ పగలు, భావోద్వేగాల నడుమ సాగుతున్న పొదరిల్లు సీరియల్!

Aug 23, 2026 11:14AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-186లో.. మీ అక్క మీద అంత ప్రేమ ఉన్నావాడివి మీ అక్కకి పుట్టిన వాళ్ళ మీద ప్రేమ ఎందుకు చూపించడం లేదని పెద్ది వాళ్ళ మేనమామయ్యని తాయారు అడుగుతుంది. మీ అక్క బాగున్నంతవరకు నా వరకు ప్రేమగానే చూసుకుంది. తనని వెళ్ళనివ్వు ఈ చంపుకోవడాలు వద్దు అని తాయారు అంటుంది. మీరు శిక్ష వేయాలని అనుకొని మీ అక్క ఆత్మకి శాంతి లేకుండా చేస్తారా, ఈ కుటుంబం మీద పడ్డని తూడ్చడానికి మేనమామగా మీరు అండగా నిలబడలేరా అని మహా అంటుంది. మా మామయ్య నిజంగా మా అత్తయ్యని చంపారో లేదో తెలియదు.. కానీ జైలు శిక్ష అనుభవించి వచ్చారు కదా.. ఇక మీరు మీ పగని మర్చిపోలేరా అని గాయత్రి అంటుంది. 

మామయ్య.. మా అమ్మ చిన్నపుడే చనిపోతే, నాన్న జైలు పాలు అవుతే మేము నలుగురం అనాధల్లా పెరిగాం మామయ్య.. మా మీద జైలుకి వెళ్ళొచ్చిన వాడి కొడుకులు అనే ముద్ర పడింది.  మా అమ్మ మా దీన స్థితి చూసి ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి అని మాధవ అంటాడు.  నువ్వు ఎన్ని చెప్పినా వీడు  మారడు..  వీడి పగ చల్లారదు.. ఎప్పటికి వాళ్ళ అక్కని నేనే చంపానని అనుకుంటాడు. అలాగే అనుకో.. నేను ప్రతీ సంవత్సరం ఈ ఊరికి వస్తాను.. మొక్కులు తీర్చికుంటూనే ఉంటానని నారాయణ అంటాడు. ఆ తర్వాత మాధవ వాళ్ళ మేనమామ అందరిని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మహా, చక్రి, మాధవ, కేశవ, కన్నా, నారాయణ అందరు కార్ లో ఇంటికి వస్తుంటారు. నొప్పిగా ఉందని చక్రి అంటాడు. దారిలో మెడికల్ షాప్ దగ్గర ఆపనా అని కేశవ అంటాడు. మహా ఆపమని చెప్తుంది. ఇక చక్రికి తగిలిన గాయాలకి మందు రాస్తుంది మహా. 

కాసేపటికి అందరు ఇంటికి వస్తారు. కేశవ బయటకి వెళ్ళొస్తానని చెప్తాడు. ఎక్కడికి అని మాధవ అడుగగా శైలు వాళ్ళ ఇంటికి అని కేశవ అంటాడు. ఒక్కడివే ఇంత రాత్రి వెళ్ళొద్దని మాధవ చెప్తాడు. దాంతో అతని వెంట చక్రి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక శైలు వాళ్ళ అమ్మ వరాలు ఉంటుంది. కేశవని చూసి..ఇదేనా మీ అన్నయ్య పెంపకం.. మా కూతురిని తల్లిని చేశావంటు కేశవని తిడుతుంది. ఇక శైలు వాళ్ళ నాన్న, శైలు వాళ్ళ అన్నయ్య సురేష్ కూడా వచ్చి కేశవని తిడుతుంటే అప్పుడే శైలు వచ్చి వాళ్ళని ఆపుతుంది‌. ఆపండి.. కేశవ ఏం తప్పు చేయలేదు..నేనే అబద్ధం చెప్పానని శైలు అనగానే వరాలు, సురేష్, చక్రి, కేశవ, శైలు వాళ్ళ నాన్న అంతా షాక్ అవుతారు. నిజం చెప్పమని వరాలు అనగానే మీరు ఎక్కడ నాకు నచ్చని పెళ్ళి చేస్తారేమోనని అప్పుడు అలా అబద్ధం చెప్పానని శైలు అంటుంది. చూసారా మా తమ్ముడి తప్పేం లేదని చక్రి అంటాడు. ఎప్పటికైనా శైలు నాదే అంటూ శైలుని తీసుకొని కేశవ బయటకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Podharillu serial, Podarillu latest episode, Telugu serial updates, Mahalakshmi Chakri, Kesava Shailu story

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com