.webp)
పొదరిల్లు(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 244లో... కేశవ షాపు కోసం డబ్బులు ఇచ్చిన తర్వాత మహా నారాయణకు బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లి ఇస్తుంది. అది చూసిన కన్నా.. మా అమ్మను వెళ్లగొట్టిన ఇతనికి బిర్యానీయా అని ప్లేట్ లాక్కుని పడేయబోతాడు. దీంతో మహా.. ఒక్క మెతుకు కింద పడినా మామూలుగా ఉండదు, మీ అమ్మ వెళ్లిపోవడానికి ఆయనకు సంబంధం లేదని క్లాస్ పీకి ప్లేట్ తిరిగి ఇప్పిస్తుంది. ఇంట్లోకి వచ్చాక కూడా కన్నా మహాను నిలదీసి.. నువ్వు నారాయణకే సపోర్ట్ చేస్తున్నావని అంటే నీకు తండ్రి అంటే గౌరవం లేదని మహా తిడుతుంది. పెద్ది, చక్రి, కేశవ కూడా కన్నాను తిడతారు.
ఆ తర్వాత మాధవ కన్నాను ఓదార్చి.. వదిన ఎప్పుడూ నీ ఆనందం కోసమే ఆలోచిస్తుంది, నీకు సర్ ప్రైజ్ ఇవ్వాలనే మీ అమ్మను తీసుకొచ్చింది, చూశావా అనుకోవడం వేరని సర్దిచెప్తాడు. అటు చక్రి మహాతో మరో షాకింగ్ విషయం చెప్తాడు. జమునతో ఉన్న వ్యక్తి ఆమె భర్తే, అతను మంచివాడు కాదు.. ఆమెను కొడుతూ ఉంటాడు.. ఊరంతా అప్పులు చేశాడు.. ఆ ఇద్దరి గురించి ఒక్కరు కూడా మంచిగా చెప్పలేదని చెప్తాడు. దీంతో మహా "కొడుకు ఇంట్లోనే దొంగతనం చేసేంతలా దిగజారిందా అని మహా అసహ్యించుకుంటుంది. మరోవైపు కేశవకు శైలు ఫోన్ చేసి.. షాపు కోసం డబ్బులు ఇవ్వడానికి ఫ్యామిలీని తీసుకెళ్లావ్.. నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు.. నేను నీ ఫ్యామిలీ కాదా అని క్లాస్ పీకుతుంది.
చివర్లో మహా కన్నా దగ్గరకు వెళ్లి మళ్లీ క్లాస్ పీకుతుంది. 20 ఏళ్ల వయసు లేదు, 60 ఏళ్ల వ్యక్తితో అలాగేనా మాట్లాడేది.. నీ మీద ప్రేమ ఉంటే మీ అమ్మ నిన్ను పుట్టగానే వదిలేసి 20 ఏళ్లకు ఎందుకు వస్తుంది.. మొదటి భార్యను చంపాడని అంటారు.. మీ అమ్మను చంపాడని అంటారు.. అది నిజమా, తాగి నిన్నేమైనా అన్నాడా అని నిలదీస్తుంది. మహా మాటలు విని మాధవ ఎమోషనల్ అయి.. నా తర్వాత నాన్నను అర్థం చేసుకున్నది మహానే.. గత జన్మలో ఆమె మనకు అమ్మేమో అంటాడు. చివర్లో మహా రోడ్డు మీద జమునను అడ్డగించి.. కన్నకొడుకు ఇంట్లో దొంగతనం ఎందుకు చేశావ్.. నారాయణ ఎందుకు వెళ్లగొట్టాడని నిలదీస్తే కన్నా తండ్రి నారాయణ కాదని జమున షాకింగ్ నిజం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
