Home

»

Tv News

Podharillu : కేశవ ఎమోషనల్.. జమునపై మహాకి అనుమానం!

Oct 17, 2026 8:52AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు' (Podarillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-238  లో..... కేశవ కొత్త షాప్ కోసం డబ్బుల కోసం కుటుంబమంతా ప్రయత్నాలు చేస్తుంది. మాధవ్ తన ఇంజినీర్ దగ్గర 7 లక్షలు అడ్వాన్స్ అడగ్గా ఇంజినీర్ కొంత సాయం చేస్తానని హామీ ఇస్తాడు. మనీషా తన బంగారు గాజులు తీసి ఇచ్చి అమ్మి కేశవకు ఇవ్వమని చెప్తుంది. చక్రి కూడా తన ఓనర్ శ్రీకరేశ్వర్ దగ్గర సెంటిమెంట్ డ్రామాతో అడ్వాన్స్ తీసుకుంటాడు. అందరి ప్రేమ చూసి కేశవ ఎమోషనల్ అవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంట్లోకి డబ్బులు వస్తే కొట్టేయాలని జమున ప్లాన్ వేస్తుంది.

 

మరోవైపు జమున తన రెండో భర్తతో ఫోన్ లో మాట్లాడుతుండగా మహా చూసేస్తుంది. ఏంటి కంగారు పడుతున్నారని మహా అడగ్గా ఇది నా ఇల్లే కదా కంగారు ఎందుకంటూ జమున కవర్ చేస్తుంది. నాకు ఎవరున్నారు అనాథని కదా అని డ్రామా ఆడుతుంది. మరి చక్రి ఆ రోజు మీతో ఎవరో ఉన్నారని అన్నాడు. అతను ఎవరని మహా నిలదీయడంతో అతను మా ఇంటి పక్కింటి వాడు అంటూ తప్పించుకుంటుంది. జమున ఏదో దాస్తోందని మహాకు అనుమానం మొదలవుతుంది. చక్రిపై మహా ప్రేమ కురిపించినట్లు ఫోన్ చేయడంతో చక్రి తెగ సిగ్గుపడతాడు కానీ నారాయణ గురించి మహా తెలుసుకోవడానికి అడిగిందని తెలిసి డీలా పడతాడు.

 

అందరు బయటకు వెళ్లిపోగానే ఇంట్లో డబ్బు, నగలు ఏమైనా ఉన్నాయేమోనని జమున వెతుకుతుంది. నారాయణ వచ్చి మళ్లీ ఎందుకు వచ్చావు. నీకు సిగ్గుందా అని నిలదీస్తాడు. ఇప్పుడిప్పుడే ఈ బృందావనానికి ఉన్న శాపం పోయింది మళ్లీ నువ్వు వచ్చి చెడగొట్టవద్దని వార్నింగ్ ఇస్తాడు. జమున మాత్రం ఆశ్రయం కోసం, కొడుకు ప్రేమ కోసం వచ్చానని ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com