Home

»

Tv News

Podharillu: చక్రిని ఆటాడుకున్న మహా.. పెద్ది పెళ్లి చూపుల్లో షాకింగ్ ట్విస్ట్!

Sep 5, 2026 9:58AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 201 లో.....చక్రిని మహా ఓ ఆట ఆడుకుంటుంది. ఇంట్లో పనులు చేయమని.. లేదంటే హాస్టల్ కి వెళ్లిపోతానని డ్రామా చేయడంతో చక్రి కిచెన్ లో బాగున్న ప్లేట్లు కూడా కడగాల్సి వస్తుంది. తినడానికి ఓ ప్లేట్, కర్రీకి ఓ ప్లేట్, వడియాలకు ఓ ప్లేట్ వాడుకున్నప్పుడు తెలియదా అంటూ మహా కౌంటర్లు వేస్తూ పక్కింటి వాళ్లవి కూడా ఇస్తారా అన్న చక్రి మాటలకు సెటైర్లు వేస్తుంది. చక్రి కష్టపడి డిష్ లు కడుగుతుంటే కన్నా, కేశవ నవ్వుతూ వీడియో తీసి.. పెద్ది రోజూ చేస్తుంటాడు నువ్వు కూడా అలవాటు చేసుకోమంటూ మహా మరింత ఆడుకుంది.

 

అసలే పెళ్లి చూపులకు టైమ్ అవుతోందని మహా చెప్పడంతో ఇంట్లో అందరు షాక్ అవుతారు. పెళ్లిచూపులు పెద్దికి సంబంధం ఆయనే వెతుక్కున్నాడని మహా చెప్పడంతో అసలు పెళ్లి చూపులంటేనే పారిపోయే అన్నయ్య ఇదంతా చేయడం ఏంటని కేశవకి అనుమానం వచ్చింది. నాకు చెప్పరా, నా పెద్దరికానికి గౌరవం ఇవ్వరా అని నారాయణ హర్ట్ అయితే రెండు గంటల ముందే చెప్పాడని మహా అంటుంది. కానీ పెద్ది మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు.

 

కారులో వచ్చిన జయంతి డోర్ కూడా మూయకుండా, చెప్పులు మురికిగా ఉన్నా అలానే లోపలికి వచ్చి ఓవర్ యాక్షన్ చేయడంతో అందరు షాక్ అవుతారు. ఇల్లంతా చూస్తూ ఇంకా ఏ కాలంలో ఉన్నారంటూ, ఇంటి డాక్యుమెంట్లు చూడమంటూ బెడ్ రూం చూడాలంటూ ప్రాపర్టీ కోసమే వచ్చానని జయంతి తేల్చేసింది. చివర్లో విడాకులైన వెంటనే పెళ్లి చేద్దామని వాళ్ల తరపు ఆవిడ అనడంతో అంటే మీది రెండో పెళ్లా అని కేశవ షాక్ అవుతాడు. అవును డివోర్స్ తర్వాత పెళ్లి అంటే రెండో పెళ్లే కదా అని జయంతి చెప్పినా పెద్ది సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com