Home

»

Tv News

Podarillu: మాధవ జీవితంలోకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన మనీషా.. మహా పెళ్లి నిజం బయటపడుతుందా?

May 30, 2026 11:31AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు' (Podarillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -125 లో... కేశవ మెకానిక్ షాప్ కి శైలు వస్తుంది. మీ అన్న ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని అసిస్టెంట్ ని అడుగుతుంది. తనకంటే పెద్దన్నయ్య ఉన్నాడు అందుకే అని అతను చెప్తాడు. అప్పుడే కేశవ వస్తాడు. మీ అన్నయ్యకి పెళ్లి సంబంధం చూడాలా అని కేశవని శైలు అడుగుతుంది. అవసరం లేదు.. మేం చూసుకోగలం.. మా అన్నయ్య కోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటుందని కేశవ అంటాడు.  

అప్పుడే ఒక అమ్మాయి ఆటో దగ్గర ఉంటుంది. అదే ఆటో దగ్గరికి మాధవ వస్తాడు. ఇద్దరు ఒకే ఆటో ఎక్కుతారు. ఆ అమ్మయికి తెలుగు రాదు.. మాధవకి హిందీ రాదు. ఆటోకి డబ్బు ఇవ్వడానికి ఆటో డ్రైవర్ మాట్లాడుతుంటే.. ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు.. దాంతో మాధవ ఆటోకి డబ్బు ఇస్తూ.. ఇన్ని డబ్బులు ఇవ్వాలని హెల్ప్ చేస్తాడు. 

ఆ తర్వాత నాకు బోర్ కొడుతోంది వదిన.. గుడికి వెళదామని మహా అనగానే హరిక సరే అంటుంది. ఆ తర్వాత సిరిని స్కూల్ లో దింపాలి డ్రైవర్ ని పిలవండి అని ప్రతాప్ తో లలిత అనగానే డ్రైవర్ బయటకు వెళ్ళాడని ఆది చెప్తాడు. డ్రైవర్ ఉన్నాడుగా అని చక్రిని ప్రతాప్ పిలిచి వాళ్ళని తీసుకొని వెళ్ళమని చెప్తాడు. అత్తయ్యకి నేను కొత్త కానీ డ్రైవింగ్ కి కాదు మావయ్య అని చక్రి అంటాడు. 

మరొకవైపు మాధవ తన మేస్త్రి పని చేస్తుంటే అప్పుడే తన తోటి మేస్త్రి ఊరు నుంచి తనకి స్వీట్ తీసుకొని వచ్చి ఇస్తాడు. చాలా బాగుంది స్వీట్ అని మాధవ అంటాడు. ఇది కాకుండా నీకొక సర్ ప్రైజ్ అని ఒక అమ్మాయిని పిలుస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు.. మాధవతో ఆటోలో కలిసి ప్రయాణం చేసిన అమ్మాయి. తను నా చెల్లి మనీషా అని అతను మాధవకి పరిచయం చేస్తాడు. దాంతో తనకి ఆటో దగ్గర బాష రాక ఇబ్బంది పడ్డప్పుడు హెల్ప్ చేసిన విషయం మాధవ చెప్తాడు. దానికి మనీషా థాంక్స్ చెప్తుంది. మా చెల్లి వచ్చింది కదా.. నువ్వు ఈ రోజంతా తనతో గడుపు పనికి అవసరం లేదని మాధవతో అతను చెప్తాడు.

మరొకవైపు ప్రతాప్, ఆది, లలిత కలిసి శాశ్వతంగా మహాని అక్కడే ఉంచడానికి ప్లాన్ చేస్తారు. అందరు భోజనం చేస్తుంటే అల్లుడు గారు మీరు మా బిజినెస్ చూసుకోండి అని ప్రతాప్ చెప్తాడు. నాకు అవన్నీ తెలియదని చక్రి అంటాడు. ఆ తర్వాత అల్లుడు గారిని బిజినెస్ చూసుకోమని మీరిద్దరు ఇక్కడే ఉండండి అని లలిత అంటుంది. నేను ఉద్యోగం చెయ్యాలి నాన్న అని మహా చెప్తుంది. ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు భూషణ్ చేసింది కూడా చెప్తుంది. ఇంకొకసారి మహా జోలికి భూషణ్ రాకుండా చూడమని ఆదితో ప్రతాప్ చెప్తాడు. 

మా వాళ్ళు పూర్తిగా మారిపోయారు.. ఇప్పుడు మా పెళ్లి అబద్ధపు పెళ్లి అని చెప్తానని మహా అనుకుంటుంది. ఎక్కడ మహా నిజం చెప్తుందోనని చక్రి వచ్చి.. మహా బయటకు వెళదామా అని అంటాడు. లేదు మా వాళ్ళతో టైమ్ స్పెండ్ చెయ్యాలని ఉందని మహా అంటుంది. 

ఆ తర్వాత ప్రతాప్ కి ఏదో ఫోన్ వస్తే ఆదిని తీసుకొని బయటకు వెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళందరు ఏదో ప్లాన్ చేస్తున్నారని చక్రికి అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com