అందాల రాక్షసి హిట్ కానీ అవకాశాలు ఫట్..
on Jul 5, 2025
అందాల రాక్షసి మూవీతో హిట్ కొట్టిన నవీన్ చంద్ర యాక్టింగ్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆ మూవీ తర్వాత గ్యాప్ రావడం ఆ తర్వాత అరవింద సమేత చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా కాకమ్మ కథలు ఎపిసోడ్ కి వచ్చి తన లైఫ్ లోని స్ట్రగుల్స్ గురించి చెప్పాడు. " పాపింగ్, రాకింగ్, బి-బాయింగ్ , బ్రేక్ డాన్స్ ఇవన్నీ రకరకాల డాన్స్ స్టైల్స్ నేను ఎక్కడా నేర్చుకోలేదు. మా బ్రదర్ నేర్పించాడు. మా ఊళ్ళో డాన్స్ షో పెడితే మా ఊరి వాళ్ళు టికెట్స్ కొని మరీ షో చూసేవాళ్ళు. అప్పుడే నాకు యాక్టర్ అవ్వాలనుకున్నాను ఇక్కడికి వచ్చాను. తేజ గారి వల్లనే వచ్చాను. ఆయన ఒక యాడ్ పోస్ట్ చేసారు. నవదీప్ ది జై మూవీ.
ఆ మూవీ ఆడిషన్ కోసం నేను హైదరాబాద్ వచ్చాను. ఐతే ఆడిషన్ లో నాకు కుదరలేదు కానీ ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ రవి వర్మ "సంభవామి యుగే యుగే" అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఒక నాలుగేళ్లు బ్రేక్ వచ్చింది. అందాల రాక్షసి మూవీ చేసాను. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది కానీ యాక్టర్ గా నేను ఒక్కసారిగా కింద పడిపోయాను. అప్పుడు ఈ ఇండస్ట్రీ నుంచి నేను వెనక్కి వెళ్ళకూడదు అనుకున్న టైములో నేను రాజా రవీద్రగారిని కలిసాను.. అయన వల్ల నా లైఫ్ మారిపోయింది. త్రి మంత్స్ ఎంజాయ్ చెయ్యి అన్నారు. చేతిలో సినిమా లేదు. ఎం చేయాలో తెలీదు. ఆయనకు ఎలా చెప్పాలో తెలీదు. అలా చాల కలం తర్వాత ఇద్దరం కొలాబరేట్ అయ్యి అరవింద సమేత మూవీ చేసాం. నిజానికి ఆ సినిమాను నేను చేయను అని చెప్పాను. కానీ రాజా రవీంద్ర గారు నన్ను కన్విన్స్ చేశారు. ఒక్క సినిమా ఆడియన్స్ కి రీచ్ ఐతే చాలు అన్నారు. అలా ఇప్పటి వరకు అసలు గ్యాప్ లేకుండా మూవీస్ చేస్తూనే ఉన్నాను" అని చెప్పాడు నవీన్ చంద్ర. తర్వాత హోస్ట్ తేజు నవీన్ చంద్ర ఫ్యూచర్ చెప్పింది. "యాక్టింగ్ రిలేటెడ్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు అందుకోవాలని" అని విష్ చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
