Home

»

Tv News

Illu illalu pillalu :నర్మదను చిక్కుల్లో నెట్టేస్తున్న భాగ్యం..ఊహించని మలుపు!

Apr 14, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -444 లో.... ప్రేమకి  ధీరజ్ భోజనం తినిపిస్తాడు. దాంతో  అతని వంక ప్రేమగా చూస్తుంది ప్రేమ . అప్పుడే రేవతి, శారదాంబ వస్తారు. వాళ్ళని అలా  చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. నా మనవడు ప్రేమని బాగా చూసుకుంటున్నాడని శారదాంబ అంటుంది. ఎలా ఉన్నావని  రేవతి తనని దగ్గరికి తీసుకుంటుంది. బాగున్నా అమ్మ అని ప్రేమ చెప్తుంది. అసలు మీరు వచ్చారు. ఆ భద్రవతికి  తెలుసా.. ఇల్లు పీకి పందిరి వేస్తుందని ధీరజ్ వెటకారంగా మాట్లాడతాడు.

అప్పుడే రామరాజు వస్తాడు. రామరాజు వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాడు. మీ అంత బాగా మా కుటుంబం వాళ్ళు ఉంటే ఈ బాధలు ఉండేవి కాదు అన్నయ్య అని రేవతి అంటుంది. ఎప్పుడు అందరం కలిసి ఉంటామో అని తిరుపతి అంటాడు. ఆ తర్వాత వాళ్ళు  బయల్దేరి  వాళ్ళింటికి వెళ్తారు.  వాళ్ళు రావడం భద్రవతి చూసి ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. ఎక్కడికి లేదు కూరగాయల కోసం వెళ్ళమని ఇద్దరు కవర్ చేస్తారు. ఆ తర్వాత ఎలాగోలా భద్రవతికి  వాళ్లు ఎదురింటికి  వెళ్లారని అర్ధమవుతుంది. నా మేనకోడలు ఎలా ఉందని వాళ్ళని భద్రవతి అడుగుతుంది. అంత ప్రేమ ఉంటే నువ్వే చూసి రావొచ్చుగా అని శారదాంబ అంటుంది.

మరొకవైపు అసలు ఆక్సిడెంట్ ఎవరు చేశారు ఏంటన్నది తెలుసుకోవాలని నర్మద తన ఫ్రెండ్ కి  కాల్ చేసి చెప్తుంది. మరొకవైపు నర్మదని ప్రాబ్లమ్స్ లో పడెయ్యాలని భాగ్యం వాళ్ళు ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా నర్మద వాళ్ళు సేట్ దగ్గర బంగారం తాకట్టు పెట్టి ఇరవై లక్షలు అప్పు తీసుకున్నారు కదా ఆ సేట్ దగ్గరికి  వెళ్తారు .. మీకు ఆ సాగర్ డబ్బు కట్టేలా  లేడు, వెళ్లి వాళ్ళ నాన్నని అడుగుమని భాగ్యం వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com