Home

»

Tv News

Bigg Boss 10 Telugu Aman : నోరు జారితే ఊరుకునేది లేదు.. అమ‌న్‌కి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

Oct 11, 2026 12:47PM

బిగ్ బాస్ సీజన్-10 నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో అగ్నిపరీక్ష టీమ్ గ్రూప్ నామినేషన్ వీడియో వేసి మరి చూపించాడు నాగార్జున. ఇక ఆటలో నోరుజారి బూతులు మాట్లాడిన అమన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.

అమన్ గేమ్ బాగా ఆడావ్ కానీ ఆ బూతులేంటి అని నాగార్జున అన్నాడు. నేనేం అనలేదు సర్ అని అమన్ చెప్పాడు. లాస్ట్ వీక్ మాటతీరు తగ్గించుకోమంటే ఇప్పుడు బూతులు ఆడ్ చేశావా అని నాగార్జున మొదలెట్టాడు. ఆటలు బాగా ఆడుతున్నావ్.. కానీ మాటతీరు వరెస్ట్ గా ఉంది. ఆటలో నువ్వు ఉంటే ఆట కూడా నిన్నే చూస్తుంది. లీడర్ బోర్డ్‌లో టాప్‌లోకి వచ్చా.. ఆట అంత బాగా ఆడావ్. లాస్ట్ వీక్ నీకు ఎల్లో కార్డ్ ఇచ్చాను ఎందుకు.. నీ బిహేవియర్ వల్లే కదా.. అక్కడ బూతులు లేవని చెప్పి.. ఈవారం బూతులు మొదలుపెట్టావా.. ముఖేష్‌ని నీ అమ్మా అని తిట్టావా లేదా అని అడిగారు నాగార్జున. లేదు సర్ నేను తిట్టలేదని అమన్ అన్నాడు. దాంతో నాగార్జున వీడియో ప్లే చేసి చూపించాడు. అందులో నీ యమ్మ అని క్లియర్‌గా తిట్టినట్టే ఉంది. ఆ వీడియో ప్లే చేసి చూపించినా కూడా నేను నీ యమ్మా అనలేదు సర్. నా స్లాంగ్‌లో అలా అనిపిస్తుంది అంతే అంటూ రోహిత్ మాదిరిగా కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు అమన్. కానీ షాలినిని లేపి అన్నాడా లేదా అని నాగార్జున అడుగగా అన్నాడు సర్ అని షాలిని అంది. విన్నావ్ గా.. తప్పు మాట్లాడితే తెలిసిపోతుంది.

నువ్వు బయట ఏమైనా మాట్లాడుకో కానీ.. హౌస్‌లో ఆట ఒక్కటే కాదు మాట కూడా జాగ్రత్తగా ఉండాలని నాగార్జున అన్నాడు. దాంతో ముఖేష్‌కి సారీ చెప్పాడు అమన్. నువ్వు క్షమాపణ చెప్పాల్సి వస్తే నాకు కాదు మా అమ్మకి చెప్పమని ముఖేష్ అన్నాడు. దీంతో అమన్ మరోసారి సారీ చెప్పాడు. గతంలో రోడ్ టు రీలోడ్ లో 180 పాయింట్లతో టాప్ లోకి వచ్చి సేఫ్ అయిన అమన్, ఇప్పుడు బూతులతో నాగార్జున చేత వార్నింగ్ తెచ్చుకోవడం హౌస్ లో హాట్ టాపిక్ అయింది. ఆట బాగున్నా మాటతీరు మారకపోతే ఆడియన్స్ సేవ్ చేయరని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.

 

 

[Nagarjuna warning to aman, faul words of aman, bigg Boss 10 Telugu, Aman worest behaviour]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com