
బిగ్ బాస్ సీజన్-10 ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఆటతీరుని వివరించాడు హోస్ట్ నాగార్జున. నిన్నటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున రాగానే.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా లేచినిలబడ్డారు.ఆ తరువాత నరేష్ ని పొగిడాడు. నీ ఆటే కాదు.. బిహేవియర్ చాలా బావుంది. బాగా ఎంటర్ టైన్ చేస్తున్నావని నాగార్జున అన్నాడు. హౌస్‌లో విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి.. ఆ గొడవలన్నింటికీ పరిష్కారం చూపించాలని అనుకుంటున్నా.. చార్జ్ తీసుకోమంటారా? అని అడిగారు నాగార్జున. ప్లీజ్ సర్.. టేక్ ఇట్ అని అన్నారు. దాంతో నాగార్జున.. కెప్టెన్ రూంకి యాక్సెస్‌కి నరేష్‌కి ఉంటుందని చెప్పాడు.. ఇది ఆట బాగా ఆడినందుకు కాదు.. ఆడిన తీరుకి అని నాగార్జున అభినందించాడు.
ఆ తరువాత అమన్‌కి చప్పట్లు కొట్టి.. ఆటలో నిన్ను కొట్టిన వాడే లేడు అంటూ అభినందించాడు. బిహేవియర్ కూడా మార్చుకున్నావ్.. నీ ఆట కూడా ఇంప్రూవ్ అయ్యింది.. అందుకే ఫస్ట్ గోట్ అయ్యావు.. ఇలాగే ఆట ఆడు. ఒకటి గుర్తు పెట్టుకో.. మనం పైకి వెళ్తుంటే కిందికి లాగేవాళ్లు ఉంటారు. ఎంత లాగినా కూడా వెనుతిరగొద్దు అని చెప్పారు. ఆ తరువాత దేబ్జానీని పొగడ్తలతో ముంచెత్తారు. కళ్ల వెంట కన్నీళ్లు వస్తున్నా కూడా పట్టు వదల్లేదు శభాష్ అంటూ చప్పట్లు కొట్టి అభినందించాడు. ఆ తర్వాత నీతూని అభినందిస్తూ.. వచ్చిన మొదటి వారంలోనే ఏం పీకగలవో చూపించావని అన్నాడు. నీ భుజాలపై 32 కేజీలు పెట్టుకుని అంతసేపు ఎలా బ్యాలెన్స్ చేశావ్.. చాలా బాగా ఆడావంటూ నాగార్జున అభినందించాడు.
ఆ తరువాత ముకేష్‌ని అభినందిస్తూనే వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను జెంటిల్‌మెన్ అని అనుకున్నాను. మాటలు జారవు అనుకున్నా.. కానీ మాటలు జారుతున్నావ్ .. ఎలా ప్రవర్తిస్తున్నావో చూడు అంటూ వీడియో వేసి చూపించాడు. ఏమైంది నీ క్యారెక్టర్.. ఎందుకంత దిగజారి మాట్లాడావ్.. శివ్ పర్సనల్ లైఫ్ గురించి నీకు ఎందుకని క్లాస్ పీకారు. సారీ.. సర్!! నేను చాలా గిల్ట్‌గా ఫీల్ అయ్యాను సారీ కూడా చెప్పానని అన్నాడు. అప్పుడు శివ్ లేచి.. సారీ చెప్పలేదు సర్.. గొడవ అయిన తర్వాత కూడా నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడాడని శివ అన్నాడు. నీతూ ప్రొఫెషన్ గురించి మాట్లాడుతూ.. ఆమెకి డాన్స్ రాదని అనడం కూడా కరెక్ట్ కాదంటూ ముకేష్ మీద నాగార్జున ఫైర్ అయ్యాడు. ఇలాగే ఉంటే నీ పతనం మొదలౌతుందని ముఖేశ్ కి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.
[Bigg Boss 10 Telugu, Akkineni Nagarjuna, Bigg Boss Naresh, Bigg Boss Aman, Bigg Boss Debjani, Bigg Boss Mukesh, Telugu TV News]






