Home

»

Tv News

బిబి హోటల్ టాస్క్ లో ట్విస్ట్..ముఖేష్-వర్షిణి ముద్దు ఫోటో లీక్!

Oct 29, 2026 2:44PM

 బిబి హోటల్ టాస్క్ లో ట్విస్ట్..ముఖేష్-వర్షిణి ముద్దు ఫోటో లీక్!

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 నిన్నటి ఎపిసోడ్ లో బిబి హోటల్ టాస్క్ తో హౌస్ మొత్తం హీటెక్కింది. బిగ్ బాస్ ఇంటిని హోటల్ గా మార్చి కంటెస్టెంట్స్ కి కొత్త టాస్క్ ఇచ్చాడు. రెడ్ జోన్ వాళ్లు హోటల్ సిబ్బందిగా, ఎల్లో జోన్ వాళ్లు యజమానులుగా, గ్రీన్ జోన్ లోని G.O.A.T సభ్యులు గెస్ట్ లుగా మారారు. టాస్క్ లో డబ్బులు, స్టార్స్ ఎవరు ఎక్కువ సంపాదిస్తే వారికి కెప్టెన్సీ రేసులో ఛాన్స్.

ఈ టాస్క్ లోనే అసలు ట్విస్ట్ మొదలైంది. టాస్క్ ప్రకారం ముఖేష్, దేబ్జానీ జంటగా హోటల్ కి వచ్చినట్లు చూపించారు. కానీ ముఖేష్ మాత్రం అక్కడ పనిచేస్తున్న వర్షిణి వైపు ఆకర్షితుడయ్యాడు. వర్షిణితో క్లోజ్ గా ఉండటంతో దేబ్జానీ ఫైర్ అయింది. ఇదే టైంలో బిగ్ బాస్.. ముఖేష్ వర్షిణికి ముద్దు పెడుతున్న ఫొటోని స్క్రీన్ మీద రివీల్ చేశాడు.

ఆ ఫొటో చూసిన దేబ్జానీ.. నన్ను మోసం చేశావా అంటూ ముఖేష్ ని నిలదీసింది. దానికి ముఖేష్ కవర్ చేస్తూ.. వర్షిణి నా మాజీ ప్రేయసి, ఇక్కడ పనిచేస్తుందని నాకు తెలియదని చెప్పడంతో ఇంట్లో నవ్వులు, గొడవలు మొదలయ్యాయి. రోహిత్ ఆ ఫొటోని చూసి ముఖేష్ తో బేరం పెట్టి 300 తీసుకుని ఫొటో ఇచ్చేశాడు. BB హోటల్ టాస్క్ తో ఫ్రెండ్ షిప్స్, లవ్ ట్రాక్స్ అన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com