.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -121 లో...నారాయణతో ప్రతాప్ నువ్వుతు మాట్లాడుతాడు. అప్పుడే చక్రి, కేశవ ఇంటికి వస్తారు. ప్రతాప్ ని అక్కడ చూసి ఇద్దరు షాక్ అవుతారు. అమ్మ మహా అల్లుడు గారు వచ్చాడని ప్రతాప్ అంటాడు. మహా బయటకు వస్తుంది. అల్లుడు గారు నిన్న కలిసినప్పుడు నేను కోపంగా మాట్లాడాను.. తను మాత్రం సౌమ్యంగా మాట్లాడాడు. తన మాటల వల్లే నాలో మార్పు వచ్చిందని ప్రతాప్ అంటాడు. ఆ తర్వాత ప్రతాప్ లోపలికి వచ్చి లలిత వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇది ఇల్లు అంటారా. నేను వచ్చేసరికి ఇక్కడ మహా పనిమనిషి లాగా ఇంట్లో బూజు దులుపుతుందని ప్రతాప్ చెప్తాడు.
మహా మిమ్మల్ని నమ్మిందా అని లలిత అడుగుతుంది. అది నమ్మడం ఏంటి.. తన దగ్గర నేను ఎలా ఉంటానో అలా ఉన్నానని ప్రతాప్ అంటాడు. మీరు ఎలాగైనా ముందు దాన్ని ఇక్కడికి తీసుకొని రండి తర్వాత చూద్దామని లలిత అంటుంది. మరొకవైపు మాధవ, చక్రి, కేశవ, కన్నా నలుగురు కలిసి అసలు ఆయన ఎందుకు వచ్చాడని అనుకుంటారు. నాకు కొంచెం డౌట్ గానే ఉందని నారాయణ అంటాడు. ఆ తర్వాత నారాయణ, ప్రతాప్ తో కలిసి డ్రింక్ చేస్తాడు. మందు తాగాక అసలు ఆయన ఎందుకు వచ్చాడో చెప్తాడేమోనని నారాయణ అనుకుంటాడు కానీ ప్రతాప్ ఏం చెప్పడు అదంతా కేశవ, చక్రి పక్కన ఉండి చూస్తారు. ఆ తర్వాత ప్రతాప్ భోజనం చేస్తాడు. ప్రతాప్, మహా సరదాగా మాట్లాడుకుంటారు. నేను వెళ్తానని ప్రతాప్ అనగానే ఇంత రాత్రా అని మహా అంటుంది. నా కూతురు అల్లుడిని ఇంటికి తీసుకొని వెళ్తానని ప్రతాప్ అంటాడు. ఇప్పుడు ఎందుకని మహా అంటుంది. నువ్వు మొదటిసారి వచ్చినప్పుడు అవమానం జరిగిందని ప్రతాప్ అంటాడు. ఇప్పుడు రాను నాన్న నా గోల్ కి నేను రీచ్ అయ్యాక వస్తానని మహా అంటుంది.
మాధవ వెళ్ళమని చెప్తాడు. దాంతో మహా సరే అంటుంది. ఆ తర్వాత ప్రతాప్ బెడ్ పై పడుకుంటాడు. మహా నేలపై పడుకుంటుంది. అల్లుడుగారు మీరు ఎక్కడ పడుకుంటారని ప్రతాప్ అడుగుతాడు. నేను బయట పడుకుంటానని చక్రి చెప్తాడు. మా నాన్న నాకు పెళ్లి అయిందని అల్లుడుగారు అంటున్నాడు.. కాదని చెప్తే మళ్ళీ తీసుకొని వెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు.. ఇప్పుడు అసలు నిజం చెప్పొద్దని మహా అనుకుంటుంది. ఆ తర్వాత ఉదయం ప్రతాప్ వెళ్ళడానికి రెడీ అవుతాడు. చక్రి వచ్చి నేను రావడం లేదు.. మహాలక్ష్మిని కూడా పంపించడం లేదని అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
