Home

»

Tv News

mad for each other: నటరాజ్  మాష్టర్ - నీతూ ఇమ్మెచ్యూర్ ...నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు

May 30, 2026 3:19PM

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్స్ రియాలిటీ షో సీజన్ 1 ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. ఈ షోలో జాను భాను, నటరాజ్ మాష్టర్ నీతూ మధ్యలో షో స్టార్టింగ్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు కూడా ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక షో ఐపోయాక ఇప్పుడు జాను భాను జోడి ఒక ఇంటర్వ్యూ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను నటరాజ్ మాష్టర్ గురించి చెప్పుకొచ్చారు. "నటరాజ్ మాష్టర్ తో పాత పగలు ఏమీ లేవు. ఆయన్ని ఫస్ట్ టైం చూసాం. ఆయన గతంలో చేసిన షోస్ లో గెలవలేదు కాబట్టి ప్రోమోలో పడాలని ఇలాంటి స్ట్రాటిజిస్ తో వచ్చినట్టు అనిపించింది. వాళ్లకు కోపం వస్తే ఎం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. నీతూ కూడా నా లైఫ్ టార్గెట్ నువ్వే అన్నప్పుడు నేను కూడా అనొచ్చు కానీ ఆమెకు నాకు పెద్ద తేడా ఉండదు అని నేను అనలేదు. 

నటరాజ్ మాష్టర్ - నీతూ గురించి నేను ఫస్ట్ వీక్ లోనే ఇచ్చాను ఇమ్మెచ్యూర్ అని చెప్పాను. వాళ్ళు సెల్ఫ్ హ్యాపీగా ఉండాలి ఫస్ట్ అప్పుడే వాళ్ళు అనుకున్న గోల్ కి రీచ్ అవుతారు రాబోయే రోజుల్లో. ఇలాంటి రియాలిటీ షోస్ కంటే కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేయాలి. మాష్టర్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న. దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఆయన మంచి డాన్సర్. ఆయనతో పాటు వచ్చిన డాన్సర్స్ అంతా ఎప్పుడో ముందుకు వెళ్లిపోయారు. ఆయన వెనకబడిపోవడానికి కారణం ఆయన ఓటమిని తీసుకోకపోవడం కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించకపోవడం మాటలు వదిలేయడం ఇవన్నీ తగ్గించుకుంటే ఎక్కడైనా ముందుకు వెళ్తారు. " అంటూ సలహాలు ఇచ్చారు. ఇక జాను జెమినీ మ్యూజిక్ లో యాంకర్ గా చేసింది తర్వాత అల వైకుంఠపురం సీరియల్ , మా టీవీ అష్టాచెమ్మా సీరియల్ చేసాను కానీ అనుకున్నంత పేరు రాలేదు అనుకునేదాన్ని. అలాగే అఖండ, స్కంద, సవ్యసాచి వంటి మూవీస్ లో కూడా చేసాను.

 

  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com