స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-801లో.. జ్యోత్స్న రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో సుమిత్ర కంగారుపడింది. "వచ్చేస్తానని చెప్పింది, ఫోన్ కూడా పనిచేయడం లేదు" అంటూ గుమ్మం ముందు కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. దీప వచ్చి అన్నం తినమని బతిమిలాడినా వినలేదు. దీంతో దీప చందమామ కథ చెప్పి బిడ్డకు అన్నం తినిపించినట్లు "నా కూతురు పేరు చెప్పి నాతో అన్నం తినిపించావా" అంటూ సుమిత్ర ఎమోషనల్ అయింది. ఇదే టైంలో కార్తీక్ కు మాలిని అన్న మాటలు గుర్తొచ్చాయి - "సూరజ్ మనసులో జ్యోత్స్నకు స్థానం ఇస్తే ఆ మనిషే ఉండదు" అని మాలిని బెదిరించిన విషయం. దీంతో జ్యోత్స్న మిస్సింగ్ వెనుక మాలిని హస్తం ఉందా అని కార్తీక్ డౌట్ పడ్డాడు.
కార్తీక్ వెంటనే తన ప్లాన్ అమలు చేశాడు. మాలిని పెట్టించిన టిఫిన్ బండి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న టిఫిన్లన్నీ కొనేసి, ఏకంగా 10 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. శివ నారాయణ, సుమిత్ర కష్టాన్ని చూసి కస్టమర్లను కూడా పిలిచి బండి దగ్గర బిజీ చేశాడు. మరోవైపు జ్యోత్స్నకు మెసేజ్ లు, కాల్స్ చేసినా రిప్లై రాకపోవడంతో సూరజ్ తపనపడుతున్నాడు. "హలో మిస్ పొగరుబోతు, నీలాంటిది నాకు పీఏగా వద్దు" అంటూ వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఇది చూసి దక్షిణామూర్తి నవ్వుతూ "కనిపించేది మాత్రమే చూసే వయసు నీది, కనిపించనిది అర్థం చేసుకునే వయసు నాది. ఒకరు మనకు నచ్చడం లేదంటే రెండే కారణాలు - ఒకటి ప్రేమ, రెండు పగ" అంటూ సూరజ్ మనసులోని ప్రేమను బయటపెట్టాడు. "అదే గౌరవంతో జ్యోత్స్న మెడలో తాళి కడతావా?" అని అడగడంతో సూరజ్ షాక్ అయ్యాడు.
కార్తీక్, దీప కలిసి మాలినిని నిలదీశారు. జ్యోత్స్న ఆఫీసుకు రావడానికి కారణం మీ మామ, పీఏగా సంతకం పెట్టింది నీ కొడుకు, దాన్ని ఆమోదించింది నువ్వే. అన్ని మీరే చేసి మమ్మల్ని అంటున్నావా అంటూ కార్తీక్ అంటాడు. సూరజ్ మనసులో జ్యోత్స్న ఉంటే ఆ మనసు ఉండదు, మనిషే ఉండదంటూ మాలిని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. మరి జ్యోత్స్న ఎక్కడ ఉందనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Karthika Deepam2 Today October 10 Episode, Karthika Deepam2 Serial Today, Karthik Mastermind Plan Against Malini,Jyotsna Missing Suraj Tension]





